కొన్నాళ్లుగా రష్యాలో తల్లిదండ్రుల వద్ద ఉంటున్న Anna leznheva.. అటునుండి అటు సింగపూర్ వెళ్ళిపోతారట.
పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవాపై ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది. ఆమె ఒంటరిగా విదేశాల్లో సెటిల్ అయ్యే ఆలోచనలో ఉన్నారట. పిల్లల ఎడ్యుకేషన్ కోసం అన్నా సింగపూర్లో సెటిల్ కావాలనే ప్రయత్నాలలో ఉన్నారనేది, ఆ కథనాల సారాంశం. కొన్నాళ్లుగా రష్యాలో తల్లిదండ్రుల వద్ద ఉంటున్న Anna leznheva.. అటునుండి అటు సింగపూర్ వెళ్ళిపోతారట. మరి సింగపూర్లో తాత్కాలికంగా కొన్నాళ్ళు ఉంటారా... లేక లైఫ్ టైం అక్కడే సెటిల్ అవుతారా? అనేది తెలియాల్సి ఉంది.
ఇక ఈ విషయంపై యాంటీ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. పేద పిల్లలకు ఇంగ్లీష్ చదువులు వద్దన్న, పవన్ కళ్యాణ్ తన పిల్లలను మాత్రం విదేశాలలో చదివిస్తున్నారని ట్రోల్ చేస్తున్నారు. పేదలకు నాణ్యమైన విద్యలో భాగంగా అన్ని తరగతులలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టాలని, జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే తెలుగు భాషకు ఇది హాని చేసే నిర్ణయం అంటూ జగన్ పై పవన్ తీవ్ర విమర్శలు చేశారు Pawan kalyan.
మరి ఇప్పుడు తన పిల్లల ఇంగ్లీష్ చదువులకు కోసం విదేశాలకు వెళ్లడం ఏందని? యాంటీ ఫ్యాన్స్ తో పాటు వైసీపీ శ్రేణులు పవన్ ని సూటిగా ప్రశ్నిస్తున్నారు. పరిశ్రమకు, రాజకీయాలకు దూరంగా తన పిల్లలు పెరగాలనే ఉద్దేశంతోనే పవన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు మరో వాదన వినిపిస్తుంది. మొత్తంగా అన్నా సింగపూర్ లో సెటిల్ కానున్నారనే విషయంపై అధికారిక సమాచారం లేకున్నప్పటికీ ప్రముఖంగా ప్రచారం అవుతుంది.
Also read Bigg Boss Telugu 5: సిరి మనసు విరిచేసిన షణ్ముఖ్.. పదే పదే ఆ మాటలతో..
మరోవైపు భీమ్లా నాయక్ విడుదల సంక్రాంతికే ఉంటుందని పవన్ కళ్యాణ్ స్పష్టత ఇచ్చారు. Laalaa bheemla లిరికల్ సాంగ్ పోస్టర్స్ లో విడుదల తేదీగా జనవరి 12 నిర్ణయించారు. ఆర్ ఆర్ ఆర్ మూవీ కోసం భీమ్లా నాయక్ సమ్మర్ కి పోస్ట్ ఫోన్ చేస్తున్నారనే వాదనలకు తెరపడింది. మహేష్ సర్కారు వారి పాట మాత్రం సంక్రాంతి బారి నుండి తప్పుకొని, వేసవి సీజన్ ని టార్గెట్ చేసింది. ఇక లాలా భీమ్లా.. లిరికల్ సాంగ్ ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది. చేతిలో మందు, నాటు బాంబులతో పవన్ మాస్ లుక్ అలరించింది.
Also read ముద్దుల కొడుకులతో ఎన్టీఆర్ దీపావళి సెలెబ్రేషన్స్.. ఒకరిని మించి ఒకరు