ఒక్క సారి రిలీజ్ డేట్స్ మారిస్తే చాలా ఇబ్బందులు వస్తాయని పెద్ద సినిమాలు వాళ్లు ధైర్యం చేసేస్తున్నారు. ప్రస్తుతానికి ఏప్రియల్ రిలీజ్ లు అయిన వకీల్ సాబ్, లవ్ స్టోరీలు ఏ సమస్యా లేకుండా రిలీజ్ అవుతాయి.
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు రోజు రోజుకూ పెరుగుతూండటం సినీ పరిశ్రమను ఆందోళనలో పడేస్తోంది. కరోనా భయంతో ఫ్యామిలీస్ ...సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ విషయం రీసెంట్ గా రిలీజైన చిత్రాల ఓపినింగ్ కలెక్షన్స్ విషయంలో రూజువైంది. అయితే ఒక్క సారి రిలీజ్ డేట్స్ మారిస్తే చాలా ఇబ్బందులు వస్తాయని పెద్ద సినిమాలు వాళ్లు ధైర్యం చేసేస్తున్నారు. ప్రస్తుతానికి ఏప్రియల్ రిలీజ్ లు అయిన వకీల్ సాబ్, లవ్ స్టోరీలు ఏ సమస్యా లేకుండా రిలీజ్ అవుతాయి. అయితే ఆ తర్వాత మే నెలలో ఇంకా కేసులు విపరీతంగా పెరుగుతాయనే వార్తలు వస్తున్న నేపధ్యంలో ఆ టైమ్ లో రిలీజ్ అయ్యే సినిమాల విడుదల తేదీలు మారుస్తారనే టాక్ మొదలైంది. అలాంటి సినిమాల్లో మొదట వరసలో ఆచార్య, బాలయ్య బిబీ3 ఉన్నాయి.
ఇక మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా సినిమా ఆచార్య. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. అలాగే ఇటీవల రామ్ చరణ్ పుట్టిన రోజు కానుకగా చరణ్ లుక్ ను రిలీజ్ చేసింది చిత్రయూనిట్. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. సమ్మర్ స్పెషల్‌గా మే 13 న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని ఇప్పటికే టీమ్ ప్రకటించింది. అయితే ఇప్పుడు సినీ,మీడియా వర్గాల్లో వినపడుతున్న దాని ప్రకారం ఆచార్య విడుదల తేదీ ఫోస్ట్ ఫోన్ అయ్యే అవకాసం ఉందిట. అయితే అధికారంగా ఈ విషయమై న్యూస్ ఏమీ లేదు.
ఈ సినిమాను మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డితో కలిసి హీరో రామ్ చరణ్ కొణిదెల బ్యానర్‌పై నిర్మిస్తున్నాడు. ఖైదీ నెం 150 తర్వాత మరోసారి చిరంజీవితో ఈ సినిమాలో జోడీ కడుతుంది కాజల్ అగర్వాల్. మణిశర్మ చాలా ఏళ్ళ తర్వాత చిరు సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. రీసెంట్ గా ఈ సినిమా నుంచి ‘లాహే లాహే.. ‘అంటూ సాగే లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు.ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. దేవాదాయ భూముల స్కామ్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు కొరటాల. అలాగే చరణ్ కు హీరోయిన్ గా బుట్టబొమ్మ పూజ హెగ్డే నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ చిత్రంలో చిరంజీవి, చరణ్ నక్సలైట్స్ గా కనిపించనున్నారు.