విరాట్‌ కోహ్లీ, అనుష్మ శర్మలపై అమితాబ్‌ ఫన్నీ కామెంట్‌..నెటిజన్లు ఫిదా

Published : Apr 04, 2021, 05:51 PM ISTUpdated : Apr 04, 2021, 05:53 PM IST
విరాట్‌ కోహ్లీ, అనుష్మ శర్మలపై అమితాబ్‌ ఫన్నీ కామెంట్‌..నెటిజన్లు ఫిదా

సారాంశం

అమితాబ్‌ బచ్చన్‌ ఇంకా హోలీ ఫెస్టివల్‌ మూడ్‌ నుంచి ఇంకా బయటకు రాలేదనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కూడా అలాంటి జోకులే విరాట్‌ కోహ్లీ, అనుష్క శర్మలపై వేసి తనలోని హ్యూమర్‌ యాంగిల్‌ని బయటపెట్టాడు. తాజాగా ఇన్‌స్ట్రాగ్రామ్‌లో విరాట్ కోహ్లీ పేరుపై జోక్‌ వేశాడు.  

బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ ఏడు పదుల వయసులోనూ సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఆయన రెగ్యూలర్‌గా పోస్టులు పెడుతుంటారు. అయితే ఆయన హోలీ ఫెస్టివల్‌ మూడ్‌ నుంచి ఇంకా బయటకు రాలేదనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కూడా అలాంటి జోకులే విరాట్‌ కోహ్లీ, అనుష్క శర్మలపై వేసి తనలోని హ్యూమర్‌ యాంగిల్‌ని బయటపెట్టాడు. తాజాగా ఇన్‌స్ట్రాగ్రామ్‌లో విరాట్ కోహ్లీ పేరుపై జోక్‌ వేశాడు.

`అనుష్కకు భారీ అపార్ట్ మెంట్‌ ఉంది` అని పేర్కొన్నాడు బిగ్‌బీ. ఈ విషయాన్ని సోషల్‌ మీడియాలో రాసుకొచ్చాడు. అయితే ఇందులో జోక్‌ ఏంటంటే, హిందీలో `అనుష్క కే పాస్‌  విరాట్‌ ఖోలీ హై` ను ఇంగ్లీషులో `అనుష్క హాజ్‌ ఏ యూజ్‌ అపార్ట్‌మెంట్‌` అని అనువాదించాడు. ఇందులో కోహ్లీ పేరును హిందీలో ఖోలీగా రాశాడు. ఖోలీ అంటే గది అని,  విరాట్‌ను ఇంగ్లీషులో ​హ్యూజ్‌ అని రాసుకొచ్చాడు. ఈ పోస్ట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. 

కరోనా ఎఫెక్ట్ తో, మరోవైపు సమ్మర్‌ ఎఫెక్ట్ తో బాలీవుడ్‌ అంతా సీరియస్‌ మూడ్‌లో ఉంటే, బిగ్‌బీ మాత్రం ఇలా ఫన్నీ కామెంట్లు చేయడం సరదాని పంచుకుంది. ఈ సందర్భంగా బిగ్‌బీ సెన్స్‌ ఆఫ్‌ హ్యూమర్‌కి నెటిజన్లు, ఆయన అభిమానులు ఫిదా అవుతున్నారు. అంతేకాకుండా తన పోస్ట్‌లో హోళీ పండుగ గురించి రాశాడు. కాగా, ప్రస్తుతం బిగ్‌ బీ రష్మికా మందనతో ఓ సినిమా షూటింగ్‌ మొదలుకానుంది. ఇటీవలే ఈ సినిమా ప్రారంభమైంది. దీంతోపాటు `మేడే`, `బ్రహ్మాస్త్ర`, `చెహర్‌`, `జుండ్‌` చిత్రాల్లో నటిస్తున్నారు. తెలుగులో ప్రభాస్‌, నాగ్‌ అశ్విన్‌ చిత్రంలోనూ నటించబోతున్నారు.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Demon Pavan : రీతూ తో జంటగా డీమాన్ పవన్ మరో స్పెషల్ షో, స్టేజ్ పై రెచ్చిపోయి రొమాన్స్ చేయబోతున్న జోడి.. నిజమెంత?
2026 కోసం రిషబ్ శెట్టి మాస్టర్ ప్లాన్ రెడీ.. జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయబోతన్నాడా?