ప్రముఖ నటి, పద్మశ్రీ పురస్కార గ్రహీత శశికళ ఓం ప్రకాష్‌ సైగల్‌ కన్నుమూత

By Aithagoni RajuFirst Published Apr 4, 2021, 7:38 PM IST
Highlights

ప్రముఖ బాలీవుడ్‌ సీనియర్‌ నటి శశికళ ఓం ప్రకాష్‌ సైగల్‌(88) కన్నుమూశారు. ఆదివారం మధ్యాహ్నం ఆమె తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని రచయిత కిరణ్‌ కొటైల్‌ సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు. వయసుభారం, అనారోగ్యం కారణంగా ఆమె తుదిశ్వాస విడిచినట్టు తెలుస్తుంది. 

ప్రముఖ బాలీవుడ్‌ సీనియర్‌ నటి శశికళ ఓం ప్రకాష్‌ సైగల్‌(88) కన్నుమూశారు. ఆదివారం మధ్యాహ్నం ఆమె తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని రచయిత కిరణ్‌ కొటైల్‌ సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు. వయసుభారం, అనారోగ్యం కారణంగా ఆమె తుదిశ్వాస విడిచినట్టు తెలుస్తుంది. బాలీవుడ్‌ తెరపై శశికళగా పాపులర్‌ అయిన ఆమె వందకుపైగా చిత్రాల్లో నటించారు. `బిమ్లా`, `సుజాత`, `అనుపమా`, `ఆర్తి`, `వాఖ్త్`, `గుమ్ర్హా`, `ఖూబ్‌సూరత్‌` వంటి చిత్రాల్లో నటించింది. 

క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా, అనేక కీలక పాత్రల్లో నటించి మెప్పించిన శశికళ 'సోన్‌పారీ', 'జీనా ఇసి క నామ్‌ హై' వంటి పలు హిందీ సీరియళ్లలోనూ నటించారు. సినీ ఇండస్ట్రీలో ఆమె అందించిన సేవలకు గానూ ప్రభుత్వం ఆమెను 2007లో పద్మ శ్రీ పురస్కారంతో సత్కరించింది. మహారాష్ట్రలోని సోలాపూర్‌లో 1932 ఆగస్ట్ 4న జన్మించిన శశికళ ఆరు పిల్లల్లో ఒకరు. చిన్నప్పటి నుంచే సినిమాలపై ఆసక్తి. అదే సినిమాల్లోకి తీసుకొచ్చింది. శశికళ ఓం ప్రకాష్‌ సైగల్‌ని వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. శశికళ మృతికి అనేక మంది సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.

click me!