దిల్ రాజు ముందే విజయ్ దేవరకొండ డేరింగ్ కామెంట్స్... మీ అందరికీ ఒకరోజు చూపిస్తా అంటూ!

Published : Apr 01, 2024, 04:56 PM IST
దిల్ రాజు ముందే విజయ్ దేవరకొండ డేరింగ్ కామెంట్స్... మీ అందరికీ ఒకరోజు చూపిస్తా అంటూ!

సారాంశం

ఫ్యామిలీ స్టార్స్ ప్రొమోషన్స్ లో పాల్గొంటున్నారు విజయ్ దేవరకొండ. ఈ సందర్భంగా దిల్ రాజు పక్కనే ఉండగా కొన్ని డేరింగ్ కామెంట్స్ చేశాడు. వీళ్ళందరికీ ఒకరోజు చూపిస్తానని అప్పుడే ఫిక్స్ అయ్యానని అన్నాడు.   

ఫ్యామిలీ స్టార్ మూవీ ఏప్రిల్ 5న విడుదల కానుంది. నేడు మీడియా సమావేశంలో హీరో విజయ్ దేవరకొండ, నిర్మాత దిల్ రాజు, హీరోయిన్ మృణాల్ ఠాకూర్ పాల్గొన్నారు. మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పారు. అయితే దిల్ రాజు ఆఫీస్ కి ఒక సినిమా కోసం ఆడిషన్ ఇచ్చాను. కానీ నన్ను సెలెక్ట్ చేయలేదని విజయ్ దేవరకొండ అన్నారు. అయితే అప్పుడు ఏం జరిగిందో దిల్ రాజు చెప్పాడు. 

కేరింత సినిమా కోసం వేరే చోట ఆడిషన్ జరుగుతుంది. అక్కడ నేను లేను. విజయ్ దేవరకొండ ఆడిషన్ కి వచ్చి వెళ్లాడని తర్వాత నాకు చెప్పారని దిల్ రాజు అన్నాడు. ఆ రోజు సెలెక్ట్ కానందుకు నేను చాలా హర్ట్ అయ్యాను. అప్పుడే అనుకున్నా... వీళ్ళందరికీ ఒకరోజు నేనేంటో చూపించాలని, అని విజయ్ దేవరకొండ అన్నాడు. దిల్ రాజు పక్కనే ఉండగా విజయ్ దేవరకొండ డేరింగ్ కామెంట్స్ చేశాడు. 

ఫ్యామిలీ స్టార్ రొమాంటిక్ ఫ్యామిలీ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. విజయ్ దేవరకొండకు జంటగా మృణాల్ నటిస్తుంది. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఫ్యామిలీ స్టార్ ట్రైలర్ కి భారీ రెస్పాన్స్ దక్కింది. సినిమాపై అంచనాలు పెరిగాయి. యువతలో విపరీతమైన బజ్ ఏర్పడింది. 

గతంలో విజయ్ దేవరకొండ-పరశురామ్ కాంబోలో తెరకెక్కిన గీత గోవిందం భారీ హిట్ కొట్టింది. వంద కోట్లకు పైగా వసూళ్లతో పెట్టుబడికి రెట్టింపు లాభాలు పంచింది. ఈ హిట్ కాంబోపై ప్రేక్షకుల్లో పాజిటివ్ ఒపీనియన్ ఉంది. ఇక విజయ్ దేవరకొండకు ఫ్యామిలీ స్టార్ తర్వాత క్లీన్ హిట్ లేదు. ఖుషి కూడా యావరేజ్ అని చెప్పాలి. అందుకే ఫ్యామిలీ స్టార్ పై ఆయన ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. మరోవైపు మృణాల్ ఠాకూర్ సీతారామం, హాయ్ నాన్న చిత్ర విజయాలతో జోరు మీదుంది... 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Gunde Ninda Gudi Gantalu: చింటూతో రోహిణీ.. రెడ్ హ్యాండెడ్ గా బాలుకి దొరికిపోయిందా..?
Karthika Deepam 2 Today Episode: దీప గురించి నిజం తెలుసుకున్న కాంచన- అడ్డంగా దొరికిపోయిన కార్తీక్