ఇన్నోసెంట్‌గా ఉండే `ఢీ` పూర్ణ తిరగబడితే `సుందరి` అవుతుందట!

Published : Aug 01, 2021, 02:23 PM IST
ఇన్నోసెంట్‌గా ఉండే `ఢీ` పూర్ణ తిరగబడితే `సుందరి` అవుతుందట!

సారాంశం

జనరల్‌గా పూర్ణ అంటూ ఓ ఇన్నోసెంట్‌ లుక్‌ కనిపిస్తుంటుంది. కానీ ఆమెలో ఓ మాస్‌ యాంగిల్‌ ఉంది. ఆమె తిరగబడితే ఎలా ఉంటుందో తెలియాలంటే `సుందరి` సినిమా చూడాల్సిందే అంటున్నారు ఈ చిత్ర దర్శకుడు కళ్యాణ్‌ జీ గోగన.

`ఢీ` జడ్జ్ పూర్ణ ఇన్నోసెంట్‌గా ఉంటూ క్యూట్‌ లుక్స్ తో ఆకట్టుకుంటుంది. డాన్స్ షోలో ఆమె చేసే సందడి ఆద్యంతం కనువిందు చేస్తుంది. జనరల్‌గా పూర్ణ అంటూ ఓ ఇన్నోసెంట్‌ లుక్‌ కనిపిస్తుంటుంది. కానీ ఆమెలో ఓ మాస్‌ యాంగిల్‌ ఉంది. ఆమెలో ఓ రెబల్‌ ఉన్నాడు, ఆమె తిరగబడితే ఎలా ఉంటుందో తెలియాలంటే `సుందరి` సినిమా చూడాల్సిందే అంటున్నారు ఈ చిత్ర దర్శకుడు కళ్యాణ్‌ జీ గోగన. పూర్ణ, అర్జున్‌ అంబటి, రాకేందు మౌళి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం `సుందరి`. రిజ్వాన్‌ నిర్మించారు. ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతుంది. ఈ నెల 13న థియేటర్లో రిలీజ్‌ కానుంది. 

ఈ సందర్భంగా ఈ చిత్ర ట్రైలర్‌ వైరల్‌ అవుతుంది. ఇందులో పూర్ణ ఇన్నోసెంట్‌గా ఉంటూ భర్త చేసే టార్చర్‌ కారణంగా, కొంత మంది మగవాళ్లు తనని చూసే తప్పుడు దృష్టి కారణంగా, అనుకోని ఘటనలు తన జీవితంలో జరిగితే ఆమె ఎలా తిరగబడిందనే కథాంశంతో ఈ చిత్రం రూపొందుతుందని ట్రైలర్‌ చూస్తే అర్థమవుతుంది. ఇందులో పూర్ణ చాలా బోల్డ్ గా కనిపించారు. సన్నివేశాల డిమాండ్‌ మేరకు ఆమె గ్లామర్‌ షో కూడా చేయాల్సి వచ్చింది. 

దీనిపై పూర్ణ మాట్లాడుతూ, ఓ పెద్ద రేంజ్‌ హీరోయిన్లు చేయాల్సిన సినిమా ఇది. ఆ రేంజ్‌ హీరోయిన్‌ నేను కాకపోయినా, నాతో చేయించిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలని తెలిపారు. పాత్రకి న్యాయం చేశానని, తన కెరీర్‌లో బెస్ట్ రోల్‌ అవుతుందని పేర్కొన్నారు.  ఈ సందర్భంగా చిత్ర బృందానికి ధన్యవాదాలు తెలిపింది పూర్ణ. తాను మరో సినిమా కూడా దర్శకుడు కళ్యాణ్‌ జీ గోగన డైరెక్షన్‌లో చేస్తున్నట్టు తెలిపింది. ఈ కార్యక్రమంలో దర్శకుడు కళ్యాణ్‌ జీ గోగన, నిర్మాత రిజ్వన్‌, మ్యూజిక్‌ డైరెక్టర్‌ సురేష్‌ బొబ్బిలి, నటుడు రాకేందు మౌళి, హీరో అర్జున్‌ అంబటి పాల్గొని సినిమా విశేషాలను పంచుకున్నారు.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Sobhan Babu `సోగ్గాడు` మూవీతో పోటీ పడి దెబ్బతిన్న ఎన్టీఆర్‌.. శివాజీ గణేషన్‌కైతే చుక్కలే
Illu Illalu Pillalu Today: వల్లి పెట్టిన చిచ్చు, ఘోరంగా మోసపోయిన సాగర్, భర్త చెంప పగలకొట్టిన నర్మద