కొన్నేళ్ల తర్వాత.. 'అర్జున్ రెడ్డి'ని చూసి సిగ్గుపడాలి.. విజయ్ దేవరకొండ!

Siva Kodati |  
Published : May 14, 2019, 08:20 AM IST
కొన్నేళ్ల తర్వాత.. 'అర్జున్ రెడ్డి'ని చూసి సిగ్గుపడాలి.. విజయ్ దేవరకొండ!

సారాంశం

టాలీవుడ్ లో యూత్ ఐకాన్ గా మారుతున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం డియర్ కామ్రేడ్ చిత్రంలో నటిస్తున్నాడు. డియర్ కామ్రేడ్ చిత్రం జులై 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. నెమ్మదిగా ఈ చిత్ర ప్రచార కార్యక్రమాలు జోరందుకుంటున్నాయి. 

టాలీవుడ్ లో యూత్ ఐకాన్ గా మారుతున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం డియర్ కామ్రేడ్ చిత్రంలో నటిస్తున్నాడు. డియర్ కామ్రేడ్ చిత్రం జులై 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. నెమ్మదిగా ఈ చిత్ర ప్రచార కార్యక్రమాలు జోరందుకుంటున్నాయి. నటన, విభిన్నమైన యాటిట్యూడ్.. దానికి తోడు వరుస విజయాలతో విజయ్ తెలుగులో క్రేజీ హీరోగా మారిపోయాడు. విజయ్ దేవరకొండ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అర్జున్ రెడ్డి చిత్రం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

అర్జున్ రెడ్డి చిత్రంలో విజయ్ దేవరకొండ నటన యువత బాగా నచ్చేసింది. కొన్నేళ్ల తర్వాత ఆ చిత్రాన్ని చూసినప్పుడు తాను సిగ్గుపడాలని విజయ్ దేవరకొండ అంటున్నాడు. హీరోగా మీకు వ్యక్తిగత లక్ష్యాలు ఉన్నాయా అని ప్రశ్నించగా.. నా కెరీర్ లో అర్జున్ రెడ్డి బిగ్ హిట్. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ చిత్రాన్ని చూసి నేను సిగ్గుపడే స్థాయిలో ఉండాలి. భవిష్యత్తులో కూడా విజయ్ దేవరకొండ బిగ్గెస్ట్ హిట్ అర్జున్ రెడ్డే అని ఎవరైనా అంటే దానర్థం నటనలో నేను ఎదగలేదని. నటుడిగా మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని భావిస్తున్నట్లు విజయ్ చెబుతున్నాడు. 

ఇక డియర్ కామ్రేడ్ గురించి మాట్లాడుతూ.. ఈ చిత్రం కోసం నేను కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఈ చిత్రంలో నేను స్టూడెంట్ గా నటిస్తున్నా. చాలా రోజులుగా అభిమానులు ఈ చిత్రం కోసం ఎదురుచూస్తున్నారు. వారి అంచనాలకు తగ్గట్లుగా డియర్ కామ్రేడ్ ఉంటుంది అని విజయ్ తెలిపాడు. 

PREV
click me!

Recommended Stories

Remuneration: సౌత్‌లో అత్యధిక పారితోషికం తీసుకున్న ఒకే ఒక్కడు.. ఆయన ముందు ప్రభాస్, విజయ్‌, అల్లు అర్జున్‌ జుజూబీ
2025లో 8 జంటల సీక్రెట్ లవ్ ఎఫైర్స్ ..లిస్ట్ లో రాంచరణ్, ప్రభాస్, మహేష్ హీరోయిన్లు