'సవ్యసాచి' నుండి ఫస్ట్ సింగిల్ 'వై నాట్' సాంగ్!

Published : Oct 09, 2018, 11:43 AM IST
'సవ్యసాచి' నుండి ఫస్ట్ సింగిల్ 'వై నాట్' సాంగ్!

సారాంశం

నాగచైతన్య నటించిన 'సవ్యసాచి' సినిమా నవంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్రబృందం ఇప్పటినుండే సినిమా ప్రమోషన్స్ ని ముమ్మరం చేసింది. 

నాగచైతన్య నటించిన 'సవ్యసాచి' సినిమా నవంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్రబృందం ఇప్పటినుండే సినిమా ప్రమోషన్స్ ని ముమ్మరం చేసింది. ఇప్పటికే టీజర్ ని విడుదల చేసి సినిమాపై అంచనాలు పెంచేసిన చిత్రబృందం తాజాగా సినిమాలో మొదటి పాటని విడుదల చేసింది.

ఎం.ఎం.కీరవాణి సంగీతం అందించిన ఈ సినిమాలో 'వై నాట్' అనే లిరికల్ సాంగ్ ని విడుదల చేశారు. ఈ పాట విన్న చైతు అభిమానులు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. చందు మొండేటి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.

ఇప్పటివరకు తెలుగు సినిమాలలో రాని సరికొత్త కాన్సెప్ట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు. 

 

PREV
click me!

Recommended Stories

Star Debuts: టాలీవుడ్ స్టార్ల తమ్ముళ్లు, కొడుకులు, అల్లుళ్ళ ఫస్ట్ మూవీస్ ఇవే..దమ్ము చూపించిన హీరోలు ఇద్దరే
Trisha Krishnan: తిరుగులేని స్టార్‌ గా త్రిష.. ఆ నటితో పోల్చితూ ఆకాశానికి ఎత్తుతున్న కోలీవుడ్‌.. కారణమిదే