నిహారిక లైఫ్ మేటర్... డామేజ్ జరుగుతున్నా నాగబాబు సైలెంట్, రీజన్ అదేనా?

Published : Mar 21, 2023, 10:09 AM IST
నిహారిక లైఫ్ మేటర్... డామేజ్ జరుగుతున్నా నాగబాబు సైలెంట్, రీజన్ అదేనా?

సారాంశం

నిహారిక భర్తతో విడిపోతున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. వెంకట చైతన్య ఇంస్టాగ్రామ్ నుండి పెళ్లి ఫోటోలు డిలీట్ చేయడం జరిగింది. ఈ వార్తలపై నాగబాబు మౌనం వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది.   

నాగబాబుది దుందుడుకు స్వభావం. మెగా ఫ్యామిలీ జోలికి ఎవరొచ్చినా ఏకిపారేస్తారు. ప్రత్యర్థులపై సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడతారో. జనసేన నాయకుడిగా మారాక ఆయనలో ఫైర్ మరింత పెరిగింది. విమర్శించే కాడికి వస్తే దారుణమైన పదాలు వాడటానికి కూడా వెనుకాడడు. ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని తమ్మారెడ్డి భరద్వాజ విమర్శించారంటూ ఆయన మీద ధ్వజమెత్తారు. ఏకంగా నీ యమ్మా మొగుడు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

 ముఖ్యంగా మెగా ఫ్యామిలీ మీద వచ్చే ఆరోపణలను ఆయన అసలు సహించరు. వెంటనే కౌంటర్ ఇస్తారు. అలాంటిది రెండు రోజులుగా నిహారిక విడాకుల వార్తలు చక్కర్లు కొడుతున్నా నాగబాబు నోరు మెదపలేదు. నిహారిక-వెంకట చైతన్య సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్ ఫాలో అయ్యారు. వెంకట చైతన్య పెళ్లి ఫోటోలు, నిహారికతో సన్నిహితంగా ఉన్న ఫోటోలు ఇంస్టాగ్రామ్ అకౌంట్ నుండి తొలగించారు. ఇది విడాకుల వార్తలకు కారణమైంది. 

వెంకట చైతన్యతో నిహారిక విడిపోతున్నారని పదుల సంఖ్యలో కథనాలు వెలువడుతున్నాయి. ఇరు వర్గాల్లో ఈ వార్తలపై ఎవరూ స్పందించలేదు. ముఖ్యంగా నాగబాబు ఎందుకు ఖండించడం లేదనే వాదన వినిపిస్తోంది. చిన్న చిన్న విషయాలకు కూడా క్షణాల్లో స్పందించి సోషల్ మీడియా పోస్ట్స్ పెట్టే నాగబాబు మౌనానికి కారణం ఏంటనే? చర్చ మొదలైంది. ఈ క్రమంలో నిహారిక-వెంకట చైతన్య మధ్య విబేధాలు నిజమేనా? ఈ విషయంలో నాగబాబు కూతురికి సప్పోర్ట్ చేస్తున్నారా? అనే చర్చ కూడా జరుగుతుంది. 

మరొక వాదన ఏమిటంటే చిరంజీవి కలుగజేసుకున్నారని. ఇద్దరికీ సర్ది చెప్పి విడాకుల ఆలోచన విరమింప చేయాలని చూస్తున్నారని కొన్ని మీడియా సంస్థలు రిపోర్ట్ చేశాయి. మెగా అభిమానులను నిహారిక విడాకులు వార్తలు ఇబ్బంది పెడుతున్నాయి. కనీసం నాగబాబు స్పష్టత ఇవ్వాలని, ఇవ్వన్నీ పుకార్లే అని కొట్టిపారేయాలని వారు కోరుకుంటున్నారు. 

అయితే ప్రస్తుతం ఓ కొలిక్కి రాకుండా స్టేట్మెంట్ ఇవ్వడం కరెక్ట్ కాదు. నిహారిక-వెంకట చైతన్య మధ్య సంధి కుదిరితే... ఇవన్నీ నిరాధార వార్తలని ఖండింవచ్చు. లేదా చిన్న గొడవైన మాట నిజమే. ఇప్పుడంతా సర్దుకుంది. భార్యాభర్తల మధ్య ఇవ్వన్నీ సహజమే అని చెప్పొచ్చు. ఒకవేళ వ్యవహారం పూర్తిగా చెడితే మాట్లాడాల్సిన అవసరం లేదు. కొన్నాళ్ళు మౌనంగా ఉంటే జనాలకే ఒక స్పష్టత వస్తుంది. కాగా వెంకట చైతన్య మాత్రం స్పందించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇక ఏం జరుగుతుందో చూడాలి... 
 

PREV
click me!

Recommended Stories

Dhurandhar Collections: బాక్సాఫీసు వద్ద `ధురంధర్‌` కలెక్షన్ల సునామీ.. తెలుగు ఆడియెన్స్ కి గుడ్‌ న్యూస్‌
రూ. 50 లక్షలతో తీస్తే రూ. 100 కోట్లు వచ్చింది.. దుమ్మురేపిన ఈ చిన్న సినిమా ఏంటో తెలుసా.?