
సంతోష్ శోభన్ కొన్నాళ్ల నుంచి ఒకే ఒక్కహిట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఆ హిట్ కోసం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. వర్కవుట్ అవ్వడం లేదు. ఎన్ని కొత్త స్టోరీలు ప్రేక్షకుల ముందుకు తెచ్చినా.. హిట్ అవుతుందని ఫుల్ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నా.. ఎక్కడో బోల్తా పడుతున్నారు. పేపర్ బాయ్, ఏక్ మినీ కథ, మంచి రోజులు వచ్చాయి, లైక్ షేర్ సబ్ స్క్రైబ్.. ఇలా వరుసబెట్టి సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. వీటిలో ఓటీటీలో రిలీజైన ‘ఏక్ మినీ కథ’ మాత్రం ఆకట్టుకుంది. మిగతా సినిమాలన్నీ తుస్సుమనిపించాయి. థియేటర్లలో ఈ సినిమాలేవీ మినిమం ఎఫెక్ట్ చూపించలేకపోయాయి.
‘కళ్యాణం కమనీయం’ చిత్రంతో సంక్రాంతి రేసులోకి దిగి దెబ్బ తిన్నాడు. సంక్రాంతికి భారీ చిత్రాల మధ్య పోటీకి నిలిస్తే ఏదో అనుకున్నారు కానీ.. ‘కళ్యాణం కమనీయం’ పూర్తిగా నిరాశ పరిచింది. అందుకే తన కెరీర్ కి మంచి మైలేజ్ ఇచ్చిన కామెడీ ఫార్ములానే నమ్ముకుని ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఆ సినిమానే అన్నీ మంచి శకునములే. ఈ నేపధ్యంలో సంతోష్ శోభన్ తన ఫ్లాఫ్ లపై తనే సెటైర్ వేసారు. అదేంటో మీరే ఈ వీడియోలో చూడండి.
సంతోష్ శోభన్ ..హీరోగానేకాదు.. మంచి పర్ ఫామర్. కెరీర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకూ డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ సెలక్ట్ చేసుకుని సినిమాలు చేస్తున్నాడు. ఇంత యాక్టింగ్ స్కిల్ ఉన్న ఏ హీరో అయినా.. ఇప్పటికి స్టార్ హీరో రేంజ్ కి వెళ్లాలి. ఎక్కడికో వెళ్తాడనుకున్న సంతోష్ సరైన సక్సెస్ లు లేక వరస ఫ్లాప్ లతో ఇబ్బంది పడుతున్నారు. కానీ ఇప్పుడు ఆ ఫ్లాప్స్ కి చెక్ పెట్టే సాలిడ్ సినిమాతో వస్తున్నారనిపిస్తోంది ఈ చిత్రం ప్రమోషన్స్ చూస్తూంటే.
‘అన్నీ మంచి శకునములే’ అయినా సంతోష్ కెరీర్‌ను నిలబెడతాయేమో చూడాలి. వైజయంతి ఫిల్మ్స్, స్వప్నా సినిమాస్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కుతోంది. నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. మే 18న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సన్నీ కూరపాటి ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్ తన మ్యూజిక్‌తో సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లాడు.