
పవన్ కళ్యాణ్ కు, మహేష్ కు మధ్య మంచి స్నేహం ఉంది. ఆ విషయం మహేష్ బాబు పెట్టే ట్వీట్స్ లో తెలుస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఒకరికొరకు గిప్ట్ లు ఇచ్చుకోవటాలు వంటివి చేస్తూంటారు. అయితే ఇప్పుడు అందుకు వచ్చిన లోటేమీ లేదు కానీ..బ్రో సినిమా గురించి మహేష్ మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నారనేది హాట్ టాపిక్ గా మారింది. అందుకు కారణం...ఒకటే...
పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ అయ్యాక వకీల్ సాబ్ గురించి అప్పట్లో మహేష్ బాబు ట్వీటేశారు. అలాగే పవన్ కళ్యాణ్-రానా కలయికలో వచ్చిన భీమ్లా నాయక్ సినిమా చూసినట్లుగా.. ఓ రేంజిలో పొగుడుతూ ట్వీట్ వేసారు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ BRO విషయంలో మహేష్ మౌనం పాటించటం ఆశ్చర్యంగా ఉందంటున్నారు. బ్రో రిలీజ్ అయ్యి ఇన్నిరోజులైనా మహేష్ నుండి ఒక్క ట్వీట్ కూడా లేదు. దానికి తోడు బ్రో కు స్క్రిప్టు వర్క్ చేసిన త్రివిక్రమ్ తో మహేష్ గుంటూరు కారం సినిమా కూడా చేస్తున్నారు. అలాంటప్పుడు మరింత ఉత్సాహంగా బ్రో గురించి మాట్లాడుతూ ట్వీట్ వెయ్యాలి కదా అని మరికొంతమంది లాజిక్ లు తీస్తున్నారు. అయితే మహేష్ ఆ ట్వీట్ వెయ్యకపోవటానికి కారణం ..త్రివిక్రమ్ తో రిలేషన్ సరిగ్గా లేకపోవటమే అని మరికొంతమంది అంటున్నారు.
ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-సాయితేజ్ ల క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం “బ్రో”. తమిళంలో ఒటీటీలో విడుదలైన “వినోదాయ శీతం”కు రీమేక్ గా రూపొందిన ఈ చిత్రానికి సముద్రఖని దర్శకత్వం వహించగా.. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే-మాటలు సమకూర్చారు. పవన్ కళ్యాణ్ రెగ్యులర్ సినిమాలకి వచ్చే క్రేజ్ ఈ చిత్రానికి రాకపోయినప్పటికీ.ఓపినింగ్స్ బాగా వచ్చాయి. కానీ వీకెండ్ అనంతరం డ్రాప్ స్టార్ట్ అయ్యింది. అయితే ఈ లోగా అంబటి రాంబాబు ఇష్యూ రావటంతో సినిమా నిరంతరం ఏదో వార్తల్లో నలుగుతోంది. ‘బ్రో’ (Bro) చిత్రానికి రూ.97.98 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.98.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 4 రోజులు పూర్తయ్యేసరికి రూ.57.75 కోట్లు షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి మరో రూ.40.75 కోట్ల షేర్ ని రాబట్టాల్సి ఉంది.