ఇంతకీ చైతూ అక్కడికి ఎందుకు వెళ్లాడు..ఇదే ఫ్యాన్స్ లో చర్చ

Published : Aug 03, 2023, 09:36 AM IST
ఇంతకీ చైతూ అక్కడికి ఎందుకు వెళ్లాడు..ఇదే ఫ్యాన్స్ లో చర్చ

సారాంశం

ఇప్పటికే నటులుగా ఉన్నవాళ్లు కూడా యాక్టింగ్ లో మరిన్ని మెలకువలు నేర్చుకోవాలన్నా అక్కడికి వెళ్తుంటారు. ఇక చైతన్య కూడా  


తాజాగా నాగచైతన్య తన సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. అదేంటంటే.. పాండిచ్చేరిలోని ఆదిశక్తి థియేటర్‌ వారికి థాంక్యూ చెబుతూ రెండు ఫోటోలు షేర్ చేశాడు. అక్కడ చేసిన ప్రయాణం తనకి ఎప్పటికి గుర్తుండి పోతుందని చెప్పుకొచ్చాడు. ఇంతకీ చైతన్య అక్కడికి ఎందుకు వెళ్లాడని అందరూ ఆలోచనలో పడుతున్నారు.

ఇక ఆదిశక్తి థియేటర్‌ నటన కి సంబంధించిన శిక్షణ ఇవ్వడంలో పెద్ద పేరు. కొత్తగా నటన నేర్చుకోవాలన్నా, లేదా ఇప్పటికే నటులుగా ఉన్నవాళ్లు కూడా యాక్టింగ్ లో మరిన్ని మెలకువలు నేర్చుకోవాలన్నా అక్కడికి వెళ్తుంటారు. ఇక చైతన్య కూడా  అక్కడికి వెళ్లినట్లు తెలుస్తుంది. అయితే ఈ హోమ్ వర్క్ అంతా ఎందుకు అంటే....చందూ మొండేటితో చేయబోయే సినిమా కోసమే అంటున్నారు.

ఇక నాగ చైతన్య ..చందూ మొండేటి( ,  క్రేజీ కాంబోలో మరో మూవీ రాబోతుంది.  ప్రేమమ్ మూవీ తో మంచి హిట్ అందుకున్న వీరు..  త్వరలో ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. గీతా ఆర్ట్స్‌ పతాకంపై అల్లు అరవింద్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. శ్రీకాకుళం, గుజరాత్‌ నేపథ్యంలోని మత్స్యకారుల జీవితాలను ఆవిష్కరించేలా ఈ సినిమా కథ ఉంటుందట. ఇందులో చైతన్య మత్స్యకారుడిగా కనిపించనున్నారని సమాచారం. అందుకే వర్క్ షాప్ కు వెళ్లాడంటున్నారు. అలాగే వైజాగ్ వెళ్లి మత్స్యకారులను స్వయంగా కలిసి వారి జీవిత విశేషాలను తెలుసుకున్నారు.  నాగచైతన్య, చందు మొండేటి, ‘బన్నీ’ వాసు. మూడు రోజుల పాటు అక్కడే ఉండి పూర్తి వివరాలు తెలుసుకున్నారు.  ఇక ఈ మూవీకి ‘తండెల్‌’ అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నట్లు టాక్‌. శ్రీకాకుళంలో మత్స్యకారులను తండెల్‌ అని పిలుస్తారట.

ఒక క్యూట్ లవ్ స్టోరీ తో పాటు, చైతు బోటు డ్రైవర్ పాత్రలో నటిస్తారని తెలుస్తోంది. ఈ మూవీ లో నాగచైతన్య కు జోడీగా మహానటి కీర్తి సురేష్(Keerthy Suresh) నటిస్తున్నట్లు తెలుస్తోంది. చైతన్య తో కీర్తి సురేష్ తొలిసారిగా నటిస్తున్న ఈ కాంబో పై అభిమానుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. 

తాజా సమాచారం మేరకు ఈ మూవీకు కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్(Anirudh)  స్వరాలు అందించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అనిరుధ్ కనుక ఈ ప్రాజెక్ట్ లో చేరితే ఈ సారి చైతూకు హిట్ పడడం పక్కా అంటున్నారు అక్కినేని ఫ్యాన్స్. ఈ మూవీ.. శ్రీకాకుళం నుండి గుజరాత్ కు వలస వెళ్లే మత్స్యకారుల కుటుంబాల నేపథ్యంలో కథను చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu: ఈ విషయంలో అందరూ ఫెయిల్ అయ్యారు, బిగ్ బాస్ పై మండిపడ్డ రోహిణీ
Tanuja Bad Luck : జాక్ పాట్ మిస్సైన తనూజ.. బిగ్ బాస్ తెలుగు 9 రన్నరప్ బ్యాడ్ లక్, విన్నర్ ను మించిన రెమ్యునరేషన్ మిస్