Balakrishna: వృద్ధాప్యం అంటే బాలయ్యకు ఎందుకంత భయం?

Published : Feb 12, 2022, 10:49 AM IST
Balakrishna: వృద్ధాప్యం అంటే బాలయ్యకు ఎందుకంత భయం?

సారాంశం

గ్లామర్ ఫీల్డ్ లో ఉన్నవారిని బయటివారు బంధాలతో పిలవరు. పిలిచినా.. అన్న, బాబాయ్ వంటి పిలుపుల వరకు ఓకె. తాత, అంకుల్ అని పిలిస్తే హీరోలకు అసలు నచ్చదు. ఈ విషయంలో బాలకృష్ణ చాలా పర్టిక్యులర్. తన మనవళ్లు, మనవరాళ్లు తనను బాలా అని పిలవాలని రూల్ పెట్టాడట ఇంట్లో.


నటసింహం బాలయ్య టైం మామూలుగా లేదు. అఖండ (Akhanda)భారీ విజయం సాధించడం ఒకెత్తు అయితే అన్ స్టాపబుల్ షో బాలయ్య పట్ల జనాల థింకింగ్ మార్చేసింది. గంభీరంగా కనిపించే బాలయ్యలో ఎంత అల్లరి, కామెడీ టైమింగ్ ఉన్నాయో అర్థమైంది. టాలీవుడ్ టాప్ స్టార్స్ తో బాలయ్య మాట్లాడిన తీరు అందరినీ మెస్మరైజ్ చేస్తుంది. ఏకంగా వరల్డ్ రికార్డ్స్ నమోదు చేసింది అన్ స్టాపబుల్ షో. ఈ టాక్ షో కోసం బాలకృష్ణ చాలానే కష్టపడుతున్నారు. అలాగే తన షోకి ఆదరణ, ప్రచారం దక్కడంతో కోసం గట్టిగా కృషి చేస్తున్నారు. 

తాజాగా ఈ షో ప్రొమోషన్స్ లో భాగంగా బాలకృష్ణ (Balakrishna)చిన్న ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ క్రమంలో బాలయ్యను యాంకర్ కొన్ని ఆసక్తికర ప్రశ్నలు అడిగారు. వాటిలో మీరు ఎప్పుడైనా కాలేజ్ బంక్ కొట్టారా?, మీపై వచ్చే మీమ్స్ చూస్తారా? చూస్తే మీకు నచ్చిన మీమ్ ఏమిటీ? వంటి ప్రశ్నలు ఉన్నాయి. ఈ ప్రశ్నల్లో మీకు తాత అని పిలిస్తే నచ్చుతుందా? అని అడుగగా.. నిస్సంకోచంగా నచ్చదని చెప్పేశారు బాలకృష్ణ. తన సొంత మనవళ్లు, మనవరాళ్లు తాత అని పిలిచినా ఆయనకు ఇష్టం ఉండదట. 

గ్లామర్ ఫీల్డ్ లో ఉన్నవారిని బయటివారు బంధాలతో పిలవరు. పిలిచినా.. అన్న, బాబాయ్ వంటి పిలుపుల వరకు ఓకె. తాత, అంకుల్ అని పిలిస్తే హీరోలకు అసలు నచ్చదు. ఈ విషయంలో బాలకృష్ణ చాలా పర్టిక్యులర్. తన మనవళ్లు, మనవరాళ్లు తనను బాలా అని పిలవాలని రూల్ పెట్టాడట ఇంట్లో. 

వృద్ధాప్యం అంటే బాలయ్యకు చాలా భయమని దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. తాత అనే పిలుపు బహుశా బాలకృష్ణను తాను ముసలివాడైపోతున్నాడనే నిజాన్ని గుర్తు చేస్తూ ఉంటుంది. అది ఆయనలో నెగిటివ్ ఫీలింగ్స్ కలిగేలా చేస్తుంది. అందుకే బాలకృష్ణ ఆ పిలుపును ఇష్టపడకపోవచ్చు. ఆ మధ్య ఓ మూవీలో ఈవెంట్ లో సదర్ సినిమా హీరో బాలకృష్ణను అంకుల్ అని సంబోధించాడు. ఒక్కసారిగా సీరియస్ అయిన బాలకృష్ణ అతని వైపు ఉరిమి చూశాడు. 

అలాగే బాలయ్యకు అందం అంటే పిచ్చి. కుర్రాడిలా కనిపించడం కోసం కలర్ ఫుల్ చొక్కాలు, జీన్స్ లు ధరిస్తారు. విదేశాల్లో ప్రత్యేకంగా డిజైన్ చేసిన విగ్గులు వాడతారు. విగ్గు లేకుండా ఆయన అసలు బయటికి రారు. ఇక పండగలు, ప్రత్యేక సందర్భాల్లో ఈవెంట్ కి తగ్గట్లు పట్టుబట్టల్లో సాంప్రదాయంగా సిద్ధం అవుతారు. బట్టలు విషయంలో బాలకృష్ణ ఉన్నంత పర్టిక్యులర్ గా ఇంకే హీరో ఉండరు. 

కానీ పైపై మెరుగులతో వయసును, వృద్ధాప్యాన్ని దాచలేం. వయసుతో పాటు వచ్చే మార్పులను ఎవరైనా అంగీకరించాల్సిందే. ఏజ్ పెరిగే కొద్దీ ముడతల శరీరం వచ్చేస్తుంది. దాన్ని ఎవరూ ఆపలేరు. పురాణ, ఇతిహాసాలు బట్టీ పట్టిన బాలయ్య మాత్రం ఈ నిజాలు మరచి ప్రవర్తిస్తున్నారు. వృద్ధాప్యానికి భయపడుతున్నారు. ఇకనైనా ఆ భయాల నుండి బయటపడి వాస్తవాలను అంగీకరిస్తూ బాలయ్య లైఫ్ ని ఎంజాయ్ చేస్తే బెటర్. 

PREV
click me!

Recommended Stories

చిరంజీవి, అనిల్ రావిపూడి రెమ్యునరేషన్స్ కే బడ్జెట్ మొత్తం అయిపోయిందా ? ఇక సినిమా పరిస్థితి ఏంటి ?
Illu Illalu Pillalu Today Episode Dec 17: వల్లిని గట్టిగా నిలదీసిన రామరాజు, దొంగ సర్టిఫికెట్లతో భాగ్యం