
టాలీవుడ్ సీనియర్ నటుడు, ఒకప్పటి ఫ్యామిలీ హీరో జగపతి బాబు(Jagapathi Babu) గొప్ప నిర్ణయం తీసుకున్నారు. పుట్టిన రోజు సందర్భంగా జగపతి బాబు తీసుకున్న నిర్ణయానికి అందరూ ఫిదా అవుతున్నారు.
ఫ్యామీ హీరోగా ఒకప్పుడు టాలీవుడ్ లో వరుస సక్సెస్ లతో దూసుకుపోయారు జగపతి బాబు(Jagapathi Babu). ఆతరువాత హీరోగా అవకాశాలు తగ్గిన టైమ్ లో.. కెరీర్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ కమ్.. పవర్ ఫుల్ విలన్ గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన జగపతి... ఇప్పుడు కూడా స్టార్ ఆర్టిస్ట్ గానే కొనసాగుతున్నారు. ఈ ఐదారేళ్ళలో ప్రతీ పెద్ద సినిమాలో జగపతి బాబు(Jagapathi Babu) కనిపిస్తూన్నారు. హీరోగా ఎంత బిజీగా ఉన్నారో.. ఇప్పుడు క్యారెక్టర్ రోల్స్ లో కూడా అంతే బిజీగా ఉన్నారు జగపతిబాబు.
ఇక ఈ ఫ్యామిలీ హీరో 60వ పుట్టిన రోజున షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు. అందరి ప్రశంసలు పొందేలా.. అవయవ దానంపై అవగాహన పెంచేందుకు ముందుకొచ్చారు . తన పుట్టిన రోజు (ఫిబ్రవరి12) ను పురస్కరించుకుని మరణానంతరం తాను అవయవదానం చేయనున్నట్లు ప్రకటించారు జగపతి బాబు(Jagapathi Babu). ఈ గొప్ప నిర్ణయం తో ఆయన రీల్ హీరో మాత్రమే కాదు రియల్ హీరో అనిపించుకున్నారు. అంతే కాదు తన అభిమానులు కూడా ఈ అవయవదానానికి ముందుకు రావాలని జగపతిబాబు పిలుపునిచ్చారు.
జగపతి బాబు(Jagapathi Babu) చేసిన ఈ ప్రకటనకు వెంటనే రిజల్ట్ కనిపిచింది. ఆయన ఇచ్చిన పిలుపుతో మరో 100 మంది వరకు తాము కూడా అవయవదానం చేస్తామంటూ ప్రతిజ్ఞ చేశారు. వేరు వేరు చోట్ల ఉన్న ఆయన అభిమానులు అవయవదానం చేయడానికి ముందుకు వస్తున్నారు.
ఇక శుక్రవారం హైదరాబాద్‌లో.. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో జరిగిన అవయవదాన అవగాహన సదస్సులో జగపతిబాబు(Jagapathi Babu) పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలోనే ఆయన ఈ ప్రకటన చేశారు. అంతే కాదు నలుగురికి కనువిప్పు కలిగేలా కొన్ని మంచి మాటలుక కూడా చెప్పారాయన. జన్మదినం సందర్భంగా ఏదైనా పదిమందికి ఉపయోగపడే మంచి పని చేయాలనుకున్నాను. అయితే అవయవదానానికి మించిన మంచి పని లేదని ఈ నిర్ణయం తీసుకున్నాను. ఈ నిర్ణయం మరింత మందికి స్ఫూర్తి కలిగిస్తుందని భావిస్తున్నాను అన్నారు
అంతే కాదు నా అభిమానులంతా అవయవదానం చేయడానికి ముందుకురావాలి. దీనివల్ల మనం మరణించిన తర్వాత కూడా అమరులుగా మిగిలిపోతారు అని అన్నారు జగపతిబాబు(Jagapathi Babu). ఎంతో మందికి జీవితాన్నిచ్చే ఈ మంచి పనికి అందరూ ముందుకు రావాలి అన్నారు జగపతి. ఇక ఈ కార్యక్రమలో డాక్టర్స్ తో పాటు పలువురు ప్రముఖులు పాల్గోన్నారు. జగపతిబాబు(Jagapathi Babu) ను ఘనంగా సన్మానించారు.