అందుకే యాడ్స్‌లో నటించలేదు.. క్లారిటీ ఇచ్చిన బాలయ్య

Published : Jun 09, 2020, 10:06 AM ISTUpdated : Jun 09, 2020, 10:19 AM IST
అందుకే యాడ్స్‌లో నటించలేదు.. క్లారిటీ ఇచ్చిన బాలయ్య

సారాంశం

ఇన్నేళ్లలో తాను ప్రకటనల్లో ఎందుకు నటించలేదో కూడా వివరించాడు బాలకృష్ణ. బాలకృష్ణ సమాకాలీకులైన నటీనటులంతా ఏదో ఒక సందర్భంలో ప్రకటనల్లో కనిపించారు. అయితే బాలకృష్ణ మాత్రం ఎప్పుడు నటించలేదు. ఆ దిశగా ప్రయత్నాలు కూడా చేయలేదు.

నందమూరి నటసింహం బాలకృష్ణ ఈ నెల 10న తన 60వ పుట్టిన రోజు జరపుకుంటున్నాడు. షష్టిపూర్తి కావటంతో అభిమానులు ఈ వేడుకలను వినూత్నంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా బాలయ్య కూడా వరుసగా మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు ఈ సందర్భంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు బాలయ్య. తన సినీ జీవితంతో పాటు రాజకీయా విశేషాలను కూడా అభిమానులతో పంచుకున్నాడు బాలయ్య.

ఈ సందర్భంగా ఇన్నేళ్లలో తాను ప్రకటనల్లో ఎందుకు నటించలేదో కూడా వివరించాడు బాలకృష్ణ. బాలకృష్ణ సమాకాలీకులైన నటీనటులంతా ఏదో ఒక సందర్భంలో ప్రకటనల్లో కనిపించారు. అయితే బాలకృష్ణ మాత్రం ఎప్పుడు నటించలేదు. ఆ దిశగా ప్రయత్నాలు కూడా చేయలేదు. అందుకు కారణాలను కూడా వివరించాడు బాలయ్య. అభిమానుల తమపై చూపిస్తున్న ప్రేమాభిమానాలను స్వలాభం కోసం వినియోగించుకోకూడాదనే ప్రకటనల్లో నటించలేదని చెప్పాడు.

ఇది నందమూరి తారకరామారావుగారే మొదలు పెట్టారని చెప్పాడు బాలయ్య. ఎన్టీఆర్‌ కూడా ఏనాడూ ప్రకటనల్లో నటించలేదని చెప్పాడు బాలకృష్ణ. అభిమానుల ప్రేమను నా ఆర్ధిక అవసరాల కోసం వినియోగించుకోనని ఎన్టీఆర్  చెప్పేవారని, తాను కూడా అదే పద్దతిని పాటిస్తున్నాని చెప్పాడు బాలకృష్ణ. ఇటీవల వరుస ఫ్లాప్‌లు ఇచ్చిన బాలకృష్ణ, ప్రస్తుతం బ్లాక్ బస్టర్ కాంబినేషన్‌ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు.

PREV
click me!

Recommended Stories

భార్యతో పదేళ్ల ప్రేమను సెలబ్రేట్ చేసుకున్న రిషబ్ శెట్టి..బ్యూటిఫుల్ ఫోటోస్ వైరల్
Medha Rana: బోర్డర్ 2తో ప్రేక్షకుల మనసు గెలిచిన నటి ? ఆమె కుటుంబ సభ్యులంతా..