ప్రమోషన్స్ కి అనుష్క దూరం.. కారణం చెప్పిన నవీన్‌ పొలిశెట్టి.. నిజం ఏంటి?

Published : Sep 04, 2023, 08:25 PM IST
ప్రమోషన్స్ కి అనుష్క దూరం.. కారణం చెప్పిన నవీన్‌ పొలిశెట్టి.. నిజం ఏంటి?

సారాంశం

`మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి` సినిమా ప్రమోషన్స్ లో కేవలం హీరోనవీన్‌ పొలిశెట్టి మాత్రమే పాల్గొంటున్నారు.   అనుష్క ఎందుకు రావడం లేదనే సందేహాలు కలుగుతున్నాయి.

`సైలెన్స్` సినిమా వచ్చిన మూడేళ్ల తర్వాత ఆడియెన్స్ ముందుకు రాబోతుంది అనుష్క శెట్టి. నిజం చెప్పాలంటే `భాగమతి` తర్వాత ఆమె తెరపై కనిపించబోతుంది. అంటే ఐదేళ్ల తర్వాత అనుష్క వెండితెరపై కనిపించబోతుంది. `మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి` చిత్రంలో నటించింది. నవీన్‌ పొలిశెట్టి హీరోగా రూపొందిన చిత్రమిది. మహేష్‌బాబు. పి అనే నూతన దర్శకుడు దీనికి దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఈ శుక్రవారం(సెప్టెంబర్‌7)న విడుదల కాబోతుంది. 

ఈ సినిమా ప్రమోషన్స్ లో కేవలం హీరోనవీన్‌ పొలిశెట్టి మాత్రమే పాల్గొంటున్నారు. తనే ప్రమోషన్స్ మొత్తం తన భుజాలపై మోస్తున్నారు. ఎక్కడా ఆమె కనిపించలేదు. దీంతో అనుష్క ఎందుకు రావడం లేదనే సందేహాలు కలుగుతున్నాయి. ఆమె అభిమానులు అనుష్కని చూడాలని ఆతృతగా వెయిట్‌ చేస్తున్నారు. ఆ మధ్య ఎఫ్‌ ఎం రేడియోలో, అలాగే టీవీ ఛానెల్‌లో నవీన్‌ పొలిశెట్టితో ప్రాంక్‌ కాల తో అలరించింది. కానీ కనిపించలేదు. 

దీంతో ఇదే ప్రశ్న హీరో నవీన్‌ పొలిశెట్టికి ఎదురయ్యింది. దీనిపై నవీన్‌ స్పందిస్తూ తను ఔట్‌ ఆఫ్‌ ది స్టేషన్‌ అని తెలియజేశారు. ఆమె ఓ గ్రూప్‌ ఇంటర్వ్యూలో పాల్గొన్నదని, త్వరలోనే దాన్ని విడుదల చేస్తామన్నారు. ఆమె తన వంతు ప్రమోషన్స్ చేస్తూనే ఉందన్నారు. కానీ అసలు విషయాన్ని ఆయన దాటవేశారు. అయితే అనుష్క `సైజ్‌ జీరో` సినిమా సమయంలో ఉభకాయురాలిగా కనిపించడం కోసం బరువెక్కింది. ఆ తర్వాత బరువు తగ్గింది. ఈ క్రమంలో ఆమె అనారోగ్య సమస్యలు తలెత్తాయని, దాని కారణంగా ఆమె వెయిట్‌ లాస్‌ కావడం లేదని, అందుకే మీడియా ముందుకు రావడం లేదని సమాచారం.  ఇందులో నిజమెంతా అనేది తెలియాలి.

ఇక `మిస్‌ శెట్టి మిస్టర్ పొలిశెట్టి` చిత్రంలో ఆమెతో కలిసి నటించడం పట్ల నవీన్‌ చెబుతూ, మొదట ఈ విషయం తెలిసి బయటకు నార్మల్‌గానే ఉన్నానని,కానీ లోలోపల మాత్రం పట్టలేని ఆనందంతో ఉన్నట్టు తెలిపాడు. అయితే తామిద్దరం పెయిర్‌గా నటించడానికి కారణం ఏంటనేది మాత్రం సినిమా చూస్తే తెలుస్తుందని, దానికి ఓ బలమైన కారణం ఉందని చెప్పాడు నవీప్‌. 

సినిమా గురించి చెబుతూ, కృష్ణాష్టమి రోజు మా మూవీ రిలీజ్ అవుతుంది, కృష్ణుడు ఎలా అల్లరి చేస్తాడో, ఈ సినిమా కూడా అంతే అల్లరిగా ఉంటుంది. `జాతి రత్నాలు` మూవీ చేసిన తర్వాత చాలా కథలు విన్నాను. జాతి రత్నాలు సినిమా సక్సెస్ కు మ్యాచ్ అయ్యే మంచి మూవీ సెలెక్ట్ చేసుకోవాలని వేచి చూశాను. మహేశ్ ఈ కథ చెప్పినప్పుడు ఆ ట్రాన్స్ లో కొద్ది సేపు ఉండిపోయా.  క్యారెక్టర్స్ కు వెయిట్ ఉంటుంది. సినిమాలో మంచి ఎమోషన్స్ ఉంటాయి. ఈ కథలో హీరోకున్న స్టాండప్ కామెడీ క్యారెక్టర్ నన్ను ఆకట్టుకుంది. స్టాండప్ కామెడీకి బయట చాలా డిమాండ్ ఉంది. ఈ ఆర్ట్ ఫామ్ ను ఎవరూ చిన్నచూపు చూడటం లేదు. తెలుగు ఆడియెన్స్ కు తెలుగు స్టాండప్ కామెడీని పరిచయం చేయాలని ప్రయత్నం చేశాం. రియల్ గా స్టాండప్ కామెడీ స్టూడియోస్ లో షూట్ చేశాం. స్టాండప్ కామెడీని కరెక్ట్ గా చేయాలని రీసెర్చ్ జరిపి, పక్కాగా చేశాం.

షారుఖ్ ఖాన్ `జవాన్` సినిమా కూడా మా మూవీ డేట్ కే వస్తోంది. నేను షారుఖ్ అభిమానిని. ఒక మిడిలి క్లాస్ యువకుడు ఎంత పెద్ద స్టార్ అవగలడు అనేది షారుఖ్ చూపించారు. నాకు ఆయన ఇన్సిపిరేషన్. మన ప్రేక్షకులు బాలీవుడ్, టాలీవుడ్ అన్ని సినిమాలను ఆదరిస్తారనే నమ్మకం ఉంది. సినిమా క్లీన్ ఎంటర్ టైన్ మెంట్ ఉంటుంది. ట్రైలర్ లో ఒక బోల్డ్ డైలాగ్ ఉంది. కానీ ఆ డైలాగ్ కు ఒక రీజన్ ఉంటుంది. దాన్ని కూడా మీరు ఎంజాయ్ చేస్తారు. యూవీ సంస్థలో సినిమా చేస్తే ఆడియెన్స్ కు మరింత రీచ్ ఉంటుంది, డిస్ట్రిబ్యూషన్ బాగా చేస్తారని నమ్మాను.

కథ బాగుండి, అందులే నాకు ఎగ్జైటింగ్ రోల్ ఉంటే తప్పకుండా మరో స్టార్ హీరోతో కలిసి చేస్తాను. చాలా మంది టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వెళ్తారు. కానీ నేను అక్కడ సినిమా చేసి ఇక్కడికి వచ్చాను. మంచి కథ దొరికితే మళ్లీ హిందీలో నటిస్తా. ఇవాళ తెలుగు సినిమా స్టాటిటిక్స్ మారాయి. చాలా గ్రోత్ ఉంది. దానికి కారణం తెలుగు ఆడియెన్స్. వారు సినిమాలపై చూపించే ప్రేమే కారణం` అని చెప్పారు నవీన్‌.

దర్శకుడు పి.మహేశ్ బాబు మాట్లాడుతూ , `మా సినిమాకు మీడియా మొదటినుంచీ సపోర్ట్ చేస్తున్నారు. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సక్సెస్ మీద నమ్మకంతో ఉన్నాం. రీసెంట్ గా కొన్ని షోస్ వేసుకుని చూశాం. ఆ షోస్ కు రెస్పాన్స్ చాలా బాగుంది. శెట్టితో పోలిశెట్టి అనే హెడ్డింగ్ పేపర్ లో చదివా. ఆ రైమింగ్ తో మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి అనే టైటిల్ ఫిక్స్ చేశాం. మా ట్రైలర్ లో చూసింది 30 పర్సెంట్ అనుకుంటే సినిమాలో 70 పర్సెంట్ ఎమోషన్, ఎంటర్ టైన్ మెంట్ ఉంటుంది. మూవీ అంతా ఒక బ్యూటిఫుల్ జర్నీ అనిపిస్తుంది` అని అన్నారు.
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రీతూ కాదు, తనూజ వెంటపడేవాడిని.. షాకిచ్చిన డీమాన్‌ పవన్‌.. బిగ్‌ బాస్‌ ఎమోషనల్‌ జర్నీ
ఈ హీరోయిన్ నటించిన 4 సినిమాలు డిజాస్టర్లు.. కానీ పేరేమో మరో సావిత్రి