Allu Arjun: బన్నీకి ఆ మాత్రం అర్థం కావడం లేదా...!

Published : Feb 05, 2022, 07:04 PM IST
Allu Arjun: బన్నీకి ఆ మాత్రం అర్థం కావడం లేదా...!

సారాంశం

ఇది సోషల్ మీడియా యుగం.. ఒక సెలబ్రిటీ చర్యలకు సంబంధించిన ఫీడ్ బ్యాక్ వెంటనే వచ్చేస్తుంది . ఒప్పు చేస్తే ఎత్తేసే జనాలు... తప్పు చేస్తే అదే స్థాయిలో తిట్టేస్తారు. కాబట్టి చేసే పని, చెప్పే మాట ఏదైనా జాగ్రత్తగా ఆలోచించి చేయాలి. లేదంటే విమర్శల దాడి తప్పదు. 


అల్లు అర్జున్ (Allu Arjun)వ్యాపార ప్రకటనలు వివాదాస్పదం అవుతున్నాయి. కొన్ని నెలల క్రితం రాపిడో సంస్థ యాడ్ లో బన్నీ చేసిన కామెంట్స్ పై, తెలంగాణా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. సదరు యాడ్ తెలంగాణ ఆర్టీసీ సంస్థను కించపరచేదిగా ఉందని, సదరు యాడ్ వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. రాపిడో సంస్థకు నోటీసులు పంపిన సజ్జనార్ చట్టపరమైన చర్యలకు పూనుకున్నారు. చేసేదేమీ లేక ఆ యాడ్ ప్రసారం నిలిపివేశారు. 

తాజాగా ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో యాడ్ (zomato) లో అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ తీవ్ర వ్యతిరేకతకు గురయ్యారు. జొమాటో ప్రచార కర్తగా ఉన్న అల్లు అర్జున్ ఆ సంస్థ యాడ్ లో చెప్పిన డైలాగ్ సౌత్ చిత్ర పరిశ్రమను కించపరచేదిగా ఉందని నెటిజెన్స్ అభిప్రాయం. ఈ నేపథ్యంలో జొమాటో యాడ్ తో పాటు ప్రచారకర్తగా ఉన్న అల్లు అర్జున్ పై పలువురు విరుచుకుపడుతున్నారు . 

మాధ్యమం ఏదైనా మరొకరిని కించపరచేదిగా, మనోభావాలు దెబ్బతీసేదిగా ఉండకూడదు . అల్లు అర్జున్ నటించిన రాపిడో, జొమాటో యాడ్స్ వివాదాస్పదం కావడానికి కారణం ఇదే. రాపిడో యాడ్ లో టీఎస్ ఆర్టీసీ సంస్థను, జొమాటో యాడ్ లో సౌత్ చిత్ర పరిశ్రమను ఆయన అనుకోకుండా కించపరిచారు. అయితే దాదాపు రెండు దశాబ్దాలుగా హీరోగా కొనసాగుతున్న అల్లు అర్జున్ కి ఏది వివాదం, ఏది వివాదం కాదనే తెలివితేటలు లేవా అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి . యాడ్స్ విషయంలో అల్లు అర్జున్ జడ్జిమెంట్ ఎందుకు ఫెయిల్ అవుతుందనేది అర్థం కావడం లేదు. 

నిజానికి ఒక యాడ్ లో ఉండే కంటెంట్ తో ప్రచారకర్తకు ఏమాత్రం సంబంధం ఉండదు. అయితే ఒక పాప్యులర్ పర్సనాలిటీగా వివాదాస్పద కంటెంట్ లేకుండా చూసుకోవాలి. అలాంటి కంటెంట్ ఉంటే తొలగించేలా చర్యలు తీసుకోవాలి. లేకపోతే ఇలాంటి సమస్యలే వస్తాయి. అనవసరంగా విమర్శలకు గురి కావాల్సి వస్తుంది. ఇకనైనా అల్లు అర్జున్ తన ప్రచార వీడియోల విషయంలో చర్యలు తీసుకుంటే బెటర్. 

ఇక పుష్ప (Pushpa movie)విజయంతో అల్లు అర్జున్ ఫేమ్ డబుల్ కాగా.. ఆయన బ్రాండ్ వాల్యూ కూడా పెరగనుంది. పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు తమ ఉత్పత్తుల ప్రచారకర్తగా అల్లు అర్జున్ ని నియమించుకునే అవకాశం కలదు. కాగా పుష్ప సీక్వెల్ ది రూల్ త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా 2022 డిసెంబర్ లో విడుదల కానుందని సమాచారం. మొదటి పార్ట్ భారీ విజయం సాధించిన నేపథ్యంలో సీక్వెల్ భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Regina Cassandra: ముస్లింగా పుట్టి క్రిస్టియన్ పేరు ఎందుకు పెట్టుకుందో చెప్పేసిన రెజీనా
అఖండ 2 కు ఎదురుదెబ్బ, బాలయ్య సినిమా వసూళ్లలో భారీ పతనం, 4వ రోజు కలెక్షన్స్ ఎంతంటే?