Anchor Anasuya: కత్తిపట్టిన అనసూయ... తనలోని కొత్త యాంగిల్ పరిచయం చేసిన హాట్ యాంకర్

Published : Feb 05, 2022, 03:37 PM ISTUpdated : Feb 05, 2022, 03:38 PM IST
Anchor Anasuya: కత్తిపట్టిన అనసూయ... తనలోని కొత్త యాంగిల్ పరిచయం చేసిన హాట్ యాంకర్

సారాంశం

నటిగా బిజీ అయిన అనసూయ వెండితెరపై వైవిధ్య‌మైన పాత్ర‌ల్లో న‌టిస్తూ  ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కెరీర్ బిగినింగ్ లో పాజిటివ్ రోల్స్ చేసిన అనసూయ ఈ మధ్య వరుసగా  నెగిటివ్ పాత్ర‌ల్లో న‌టిస్తూ అంద‌రినీ మెప్పిస్తుంది. 

పుష్ప చిత్రంలో దాక్షాయ‌ణి గా మెస్మరైస్ చేశారు. డార్క్ షేడ్స్ కలిగిన ఆ పాత్ర కోసం అనసూయ మేక్ ఓవర్ అదిరింది.  న‌టిగా విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌ల‌తో మెప్పిస్తున్న అనసూయ మరోసారి నెగటివ్ టచ్ ఉన్న పాత్ర‌లో కనిపించబోతున్నారు. వివరాల్లోకి వెళితే, ఓ డెబ్యూ డైరెక్ట‌ర్ చేస్తున్న సినిమాలో అన‌సూయ న‌టించ‌డానికి ఒప్పుకున్నారు. అది కూడా గ్రే షేడ్స్ క్యారెక్ట‌ర్‌. ఆ సినిమా పేరు ద‌ర్జా. ఇందులో న‌టిస్తుండ‌టం విశేషం. పుష్ప ది రైజ్‌లో భార్య‌, భ‌ర్త‌గా న‌టించిన అన‌సూయ‌, సునీల్ ఈసారి మాత్రం పూర్తి భిన్న‌మైన పాత్ర‌లో న‌టిస్తుండ‌టం విశేషం. మ‌రి ఈ కొత్త సినిమా ద‌ర్జా అన‌సూయ‌కు ఎలాంటి గుర్తింపు తెస్తుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.

దర్జా మూవీతో పుష్ప కాంబినేషన్ రిపీట్ అయినట్లయింది. పుష్ప మూవీలో సునీల్ భార్యగా అనసూయ నటించిన విషయం తెలిసిందే. ఫస్ట్ లుక్ వీడియోతో అనసూయ పాత్రపై ఓ క్లారిటీ వచ్చింది. మరి సునీల్ ఎలాంటి పాత్ర చేస్తున్నారనేది ఆసక్తికర అంశం. ఒకప్పుడు స్టార్ కమెడియన్ గా నవ్వులు పూయించిన సునీల్... ప్రస్తుతం నెగిటివ్ రోల్స్ చేస్తున్నారు. డిస్కో రాజా, కలర్ ఫోటో, పుష్ప చిత్రాలలో ఆయన విలన్ గా కనిపించారు. దర్జా చిత్రంలో కూడా ఇదే తరహా రోల్ చేసే అవకాశం కలదు. 

నటిగా వరుస ఆఫర్స్ దక్కించుకుంటున్న అనసూయ తనకు ఫేమ్ తెచ్చిన బుల్లితెరను మాత్రం వదలడం లేదు. ముఖ్యంగా జబర్దస్త్ యాంకర్ గిరీ ఆమె వదులుకోవడం లేదు. మరో వైపు సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటో షూట్స్ తో రచ్చ చేస్తుంది. అనసూయ గ్లామర్ కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. 

PREV
click me!

Recommended Stories

Highest Remuneration: బిగ్‌ బాస్‌ తెలుగు 9 టాప్‌ 5 కంటెస్టెంట్ల పారితోషికాలు.. అత్యధికంగా తీసుకునేది ఎవరంటే?
బాలయ్యతో చేసిన ఆ సినిమా నా కెరీర్‌లో బిగ్గెస్ట్ మిస్టేక్.. ఓపెన్‌గా చెప్పేసిన స్టార్ హీరోయిన్