‘సాహో’మ్యూజిక్ డైరక్టర్ ఎంపిక ..పోటీలో వీరిద్దరే

Siva Kodati |  
Published : May 28, 2019, 07:41 PM IST
‘సాహో’మ్యూజిక్ డైరక్టర్  ఎంపిక ..పోటీలో వీరిద్దరే

సారాంశం

ప్రభాస్ ప్రతిష్టాత్మక చిత్రం ‘సాహో’ నుంచి తప్పుకున్నట్టు సంగీత త్రయం శంకర్‌ - ఎహసాన్‌ - లాయ్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాము తప్పుకుంటున్నామంటూ ...హీరో ప్రభాస్‌, దర్శకుడు సుజీత్‌, నిర్మాతలు వంశీ, ప్రమోద్‌కి అంతా మంచి జరగాలని కోరుకుంటున్నట్టు ట్విట్టర్‌లో పేర్కొన్నారు. 

 

ప్రభాస్ ప్రతిష్టాత్మక చిత్రం ‘సాహో’ నుంచి తప్పుకున్నట్టు సంగీత త్రయం శంకర్‌ - ఎహసాన్‌ - లాయ్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాము తప్పుకుంటున్నామంటూ ...హీరో ప్రభాస్‌, దర్శకుడు సుజీత్‌, నిర్మాతలు వంశీ, ప్రమోద్‌కి అంతా మంచి జరగాలని కోరుకుంటున్నట్టు ట్విట్టర్‌లో పేర్కొన్నారు. మంచో జరుగుతుందో మరొకటో జరుగుతుందో కానీ త్వరగా నిర్ణయం తీసుకుని వేరే మ్యూజిక్ డైరక్టర్ ని సీన్ లోకి తేకపోతే రిలీజ్ కు ఆలస్యం మాత్రం జరుగుతుంది. ఈ నేపధ్యంలో టీమ్ వెంటనే డెసిషన్ తీసుకునేందుకు చర్చలు జరుపుతోందిట. 
 
 ఈ నేపధ్యంలో ఇద్దరు పేర్లు బయిటకు వచ్చాయి. ‘షేడ్స్‌ ఆఫ్‌ సాహో: ఛాప్టర్‌ 1’కు తమన్‌, రెండో వీడియోకి జిబ్రాన్‌ నేపథ్య సంగీతం అందించారు. శంకర్‌ -ఎహసాన్‌ - లాయ్‌ తప్పుకోవడంతో తమన్‌ - జిబ్రాన్‌లో ఎవరో ఒకరు ‘సాహో’కి సంగీతం అందించే అవకాసం ఉందని తెలుస్తోంది. దర్శకుడు జిబ్రాన్ వైపు మ్రొగ్గు చూపుతూండగా..నిర్మాతలు మాత్రం తమన్ కే ఓటేస్తున్నారట. గిబ్రాన్ గతంలో రన్ రాజా రన్ చిత్రానికి సంగీతం అందించారు. ఇప్పటికే సాహోకు ఓ పాటను అందించారు.

అయితే మధ్యే మార్గంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కు తమన్ ని, పాటలకు గిబ్రాన్ ని తీసుకుంటే ఎలా ఉంటుందనే నిర్ణయానికి వచ్చే అవకాసం ఉందని తెలుస్తోంది. ఎవరిని మ్యూజిక్ డైరక్టర్ గా తీసుకున్నా తమన్  బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం తీసుకోవాలనే డెసిషన్ కు వచ్చారట. అతి త్వరలోనే ఈ విషయమై ఓ క్లారిటీ వచ్చి, మిగతా ఎగ్రిమెంట్స్ చేసుకుని అఫీషియల్ ప్రకటన చేసే అవకాసం ఉంది.

PREV
click me!

Recommended Stories

Illu Illalu Pillalu Today Episode Dec 24: విశ్వక్‌ను చితక్కొట్టిన ధీరజ్, కోపంతో భర్తను కొట్టిన ప్రేమ
Karthika Deepam 2 Today Episode: శ్రీధర్ అరెస్ట్ విషయంలో జ్యోపై అనుమానం- కార్తీక్ నిజం కనిపెడతాడా?