స్టార్ హీరో కూతురి డ్రెస్ దారుణంగా.. రెచ్చిపోతున్న ఫ్యాన్స్!

Siva Kodati |  
Published : May 28, 2019, 05:31 PM IST
స్టార్ హీరో కూతురి డ్రెస్ దారుణంగా.. రెచ్చిపోతున్న ఫ్యాన్స్!

సారాంశం

బాలీవుడ్ లో స్టార్ వారసులు ఎక్కువవుతున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ లో యువ నటులు, నటీమణులు అధికభాగం ఫిల్మీ బ్యాగ్రౌండ్ నుంచి వచ్చినవారే. కొత్త తరం హీరోయిన్లుగా శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్, సైఫ్ కూతురు సారా అలీ ఖాన్ ఇప్పటికే బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చేశారు. 

బాలీవుడ్ లో స్టార్ వారసులు ఎక్కువవుతున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ లో యువ నటులు, నటీమణులు అధికభాగం ఫిల్మీ బ్యాగ్రౌండ్ నుంచి వచ్చినవారే. కొత్త తరం హీరోయిన్లుగా శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్, సైఫ్ కూతురు సారా అలీ ఖాన్ ఇప్పటికే బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చేశారు. ఇదిలా ఉండగా బాలీవుడ్ బాద్షా షారుఖ్ కుమార్తె సుహానా ఖాన్ త్వరలో హీరోయిన్ గా మారబోతోందంటూ ప్రచారం జరుగుతోంది. 

ఇదిలా ఉండగా సుహానా హీరోయిన్ కాకముందే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతోంది. సెలెబ్రిటీల వారసులు పార్టీలు, పబ్బులు అంటూ ఫ్రెండ్స్ తో ఎక్కువగా తిరుగుతుంటారు. ఆ విషయంలో సుహానా ఇంకాస్త ఎక్కువగానే ఎంజాయ్ చేస్తుంది. 19 ఏళ్ల ఈ కుర్ర భామ అందంతో ఆకట్టుకుంటోంది. ఆకట్టుకునే విధంగా గ్లామర్ గా కనిపిస్తే పర్వాలేదు. కానీ సుహానా ఈ మధ్యన హద్దులు దాటే విధంగా అందాలు ఆరబోస్తోంది. 

ఇటీవల సుహానా ఖాన్ లండన్ లో తన ఫ్రెండ్ బర్త్ డే పార్టీకి హాజరైంది. ఆ పార్టీలో సుహానా వైట్ టాప్ డ్రెస్ తో మతి పోగొట్టేలా కనిపించింది. చాలా మంది సుహానా అందానికి ప్రశంసలు కురిపించారు. మరికొందరు షారుఖ్ అభిమానులు మాత్రం సుహానాని టార్గెట్ చేస్తూ ట్రోలింగ్ చేస్తున్నారు. ఈ ఫొటోల్లో సుహానా ఖాన్ హద్దులు దాటే విధంగా క్లివేజ్ షో చేస్తోందని విమర్శిస్తున్నారు. ఇలాంటి విమర్శలు ఎన్ని ఎదురైనా సుహానాకు పెద్ద ఇబ్బంది ఉండకపోవచ్చు. హీరోయిన్ గా బాలీవుడ్ ఎంట్రీకి ముందు ఇది ఒకరకంగా పబ్లిసిటీలా సుహానాకు ఉపయోగపడుతుంది. 

 

PREV
click me!

Recommended Stories

సమంత రికార్డుని బ్రేక్‌ చేసిన తమన్నా.. టాప్‌లో సాయిపల్లవి.. అత్యధిక వ్యూస్‌ సాధించిన టాప్‌ 5 సాంగ్స్
Illu Illalu Pillalu Today Episode Jan 17 అమూల్య నిశ్చితార్థం ఆపేందుకు భారీ ప్లాన్ వేసి శ్రీవల్లి, భాగ్యం.. కానీ