'బిగ్ బాస్ 3' హోస్ట్.. ఈ ముగ్గురిలో ఎవరై ఉంటారో..?

Published : Oct 03, 2018, 11:51 AM IST
'బిగ్ బాస్ 3' హోస్ట్.. ఈ ముగ్గురిలో ఎవరై ఉంటారో..?

సారాంశం

బుల్లితెర నెంబర్ వన్ రియాలిటీ షోగా ప్రేక్షకులని ఎంటర్టైన్ చేస్తోన్న బిగ్ బాస్ షో.. బాలీవుడ్ లోనే కాకుండా దక్షిణాదిన కూడా చక్కటి ప్రేక్షకాదరణ దక్కించుకుంటోంది.ఇప్పటివరకు తెలుగులో వచ్చిన రెండు సీజన్లు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశాయి. 

బుల్లితెర నెంబర్ వన్ రియాలిటీ షోగా ప్రేక్షకులని ఎంటర్టైన్ చేస్తోన్న బిగ్ బాస్ షో.. బాలీవుడ్ లోనే కాకుండా దక్షిణాదిన కూడా చక్కటి ప్రేక్షకాదరణ దక్కించుకుంటోంది. ఇప్పటివరకు తెలుగులో వచ్చిన రెండు సీజన్లు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశాయి. బిగ్ బాస్1 ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో సాగితే.. బిగ్ బాస్2 వివాదాలతో నడిచింది. సీజన్ 2 ని హోస్ట్ చేసిన నాని ఇదే తన చివరి సీజన్ అని ప్రకటించేశారు.

సో.. నాని తదుపరి సీజన్లను హోస్ట్ చేసే అవకాశం లేదు. దీంతో బిగ్ బాస్౩ కి హోస్ట్ గా ఎవరు చేయబోతున్నారనే ఆసక్తి ప్రేక్షకుల్లో మొదలైంది. దీనిపై సోషల్ మీడియాలో చర్చలు కూడా జరుపుతున్నారు. వారు ప్రధానంగా ముగ్గురు పేర్లను సూచిస్తున్నారు.

యూత్ లో ఫాలోయింగ్ సంపాదించుకున్న విజయ్ దేవరకొండ,  బాహుబలితో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రానా, అలానే స్టార్ హీరో అల్లు అర్జున్. నిజానికి అల్లు అర్జున్ పేరు సెకండ్ సీజన్ నుండి వినిపిస్తుంది. తన టాలెంట్ తో బుల్లితెర ఆడియన్స్ ని కూడా కట్టిపడేసే సత్తా ఉందని అల్లు అర్జున్ హోస్ట్ చేస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

రానాకి ఇదివరకే టీవీ షోలు చేసిన అనుభవం ఉండడంతో బిగ్ బాస్ షోకి పూర్తి న్యాయం చేయగలడని అంటున్నారు. విజయ్ దేవరకొండ బిగ్ బాస్ సీజన్ 2 లో కనిపించి స్టేజ్ ని షేక్ చేసేశాడు. అదే అతడు హోస్ట్ గా వస్తే టీఆర్పీ రేటింగ్స్ పై ప్రభావం బాగా ఉంటుందని యాజమాన్యం ఆలోచిస్తుందట. మరి ఈ ముగ్గురిలో ఎవరిని హోస్ట్ గా చేస్తారో చూడాలి!
 

PREV
click me!

Recommended Stories

Akhanda 2 Collections: `అఖండ 2` మూవీ ఫస్ట్ డే కలెక్షన్లు, బాక్సాఫీసు వద్ద దుమారం.. బాలయ్య టాప్‌ 5 ఓపెనింగ్స్
చిరంజీవి ఇండస్ట్రీకి మొగుడవుతాడని ముందే చెప్పిన స్టార్ హీరో ఎవరో తెలుసా?