'మంజుమెల్‌ బాయ్స్‌' OTT రిలీజ్ పై ఫేక్ న్యూస్, కావాలనే స్ప్రెడ్ చేసారా?

By Surya PrakashFirst Published Mar 27, 2024, 8:47 AM IST
Highlights

 రిలీజ్ డేట్ రాకుండానే తెలుగు వెర్షన్  స్ట్రీమింగ్ డేట్ అనే న్యూస్ మీడియాలో హల్ చల్ చేసి నిర్మాతలను కంగారు పెట్టింది.


ఓ సినిమా ఓటిటిలో రిలిజ్ అవుతోందని డేట్ వచ్చిందంటే ఖచ్చితంగా ఆ సినిమా కలెక్షన్స్ డ్రాప్ అవుతాయి. ఓటిటిలో ఒరిజనల్ వెర్షన్ అందుబాటులో వస్తోంటే పనిగట్టుకుని థియేటర్ కు వెళ్లి ఏం చూస్తాము అనే కాన్సెప్టులో జనం ఉన్నారు. దాంతో నిర్మాతలు ఆచి,తూచి ఓటిటి రిలీజ్ డేట్ ప్రకటిస్తున్నారు. ఓటీటి రిలీజ్ డేట్ విషయమై అనేక రూల్స్ కూడా పెట్టుకున్నారు. సినిమ రిలీజైన 45 రోజులు తర్వాత ఓటిటిలో రావాలని రూల్స్ ఉన్నా చాలా సార్లు అతిక్రమిస్తూనే ఉన్నారు. అయితే అవి ఆ నిర్మాతల డబ్బుకు సంభందించిన సమస్య కాబట్టి పెద్దగా రచ్చ అయితే జరగదు. 

కానీ రిలీజ్ కు ముందే ఫలానా రోజు ఓటిటిలో వస్తుందని న్యూస్ వస్తే మాత్రం నిర్మాత కంగారుపడతారు. కొన్ని సార్లు అలాంటి న్యూస్ లు క్రియేట్ కాబడి స్ప్రెడ్ అవుతూంటాయి. త్వరలో రిలీజ్ కు రెడీ అవుతున్న  మలయాళ బ్లాక్ బస్టర్ మంజుమెల్ బాయ్స్..ది అదే పరిస్దితి. ఈ సినిమా రిలీజ్ డేట్ రాకుండానే తెలుగు వెర్షన్  స్ట్రీమింగ్ డేట్ అనే న్యూస్ మీడియాలో హల్ చల్ చేసి నిర్మాతలను కంగారు పెట్టింది. దాంతో వారు ఖండన ప్రకటన రిలీజ్ చేయాల్సిన పరిస్దితి. అయితే అసలు ఆ న్యూస్ ని ఎవరు మొదలెట్టారు..కావాలనే స్ప్రెడ్ చేసారా అనేది క్వచ్చిన్ మార్క్ గా ఇండస్ట్రీ వర్గాల్లో టాపిక్ గా మారింది.

ఫిబ్రవరి 22న థియేటర్లలో రిలీజైన మంజుమెల్ బాయ్స్ రూ. 200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి ఆ రికార్డ్ క్రియేట్ చేసిన తొలి మలయాళ సినిమాగా రికార్డుల కెక్కింది. బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ముంజుమెల్ బాయ్స్ తెలుగు వెర్షన్‍ను థియేటర్లలో మైత్రీ మూవీస్ వారు రిలీజ్ చేస్తున్నారు .ఈ విషయమై అధికారిక ప్రకటన వచ్చింది. మరోవైపు ఈ సర్వైవల్ థ్రిల్లర్ థియేటర్లలో రిలీజై దాదాపు నెల కావొచ్చింది. దీంతో ఓటీటీ రిలీజ్ కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ముంజుమెల్ బాయ్స్ ఓటీటీ రిలీజ్ డేట్ పై కీలక అప్డేట్ అంటూ వార్తలు మొదలయ్యాయి.  ‘మంజుమెల్ బాయ్స్’ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ సొంతం చేసుకుంది. ఏప్రిల్ 5 నుంచి ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కు రానుంది అనేది ఆ వార్తల సారాంశం.  మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో కూడా ఈ సినిమాను చూడొచ్చని ప్రచారం జరుగుతోంది.అయితే ఈ విషయమై నిర్మాత ఖండన రిలీజ్ చేసారు.

నిర్మాతలు ..తమ సినిమాని ఓటిటిలో మే 2024 దాకా రిలీజ్ చేయటం లేదు అన్నారు. తాము తెలుగు వంటి మిగతా భాషల రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఓటిటిలో రిలీజ్ చేయకముందే మిగతా భాషల నుంచి కూడా రెవిన్యూ సాధించాలనే ఆలోచనలో ఉన్నారు. 

చిత్రం కథేమిటంటే...  కేరళకు చెందిన 11 మంది స్నేహితులు ఒక బృందంగా తమిళనాడు టూర్ కు వెళ్తారు. అక్కడ ఉన్న కొడకెనాల్ లోని గుణ కేవ్స్ ని చూసేందుకు వెళ్తారు. ఆ 11 మంది ఫ్రెండ్స్ లో ఒక వ్యక్తి ఆ గుణ కేవ్స్ లోని బిళంలో పడిపోతాడు. అతడిని రక్షించేందుకు సహాయక బృందాలు కూడా వెనకడుగు వేస్తాయి. కానీ, తమ స్నేహితుడిని రక్షించుకునేందుకు మిగిలిన పది మంది తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రయత్నాలు చేస్తారు. మరి.. ఆ ఫ్రెండ్ ని రక్షించారా? రెస్క్యూ టీమ్స్ కూడా వెనుకడుగు వేసేంత ప్రమాదం ఏముంది? అంత రిస్క్ తీసుకున్న వీళ్లు అనుకున్నది సాధించారా? అనేదే మంజుమ్మెల్ బాయ్స్ సినిమా కథ.

click me!