రామ్ చరణ్ సినిమాకు బన్నీ బూస్ట్ ఇవ్వబోతున్నారా?.. బర్త్ డే వేళ భలే కలిసొచ్చిందే

By Surya PrakashFirst Published Mar 27, 2024, 7:22 AM IST
Highlights

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతున్న పుష్ప 2 చిత్రం కు నార్త్ లో ఓ రేంజిలో క్రేజ్ ఉంది. 

ఇండస్ట్రీ లెక్కలు ఎప్పుడూ గమ్మత్తుగా ఉంటాయి. ఒకరు వర్కవుట్ చేసిన సినిమా..మరొకరికి బూస్ట్ ఇవ్చచ్చు. ఒకరి వేసిన దారిలో మరికొంత మంది నడుస్తూంటారు. రాజమౌళి ప్రారంభించిన ప్యాన్ ఇండియా బిజినెస్ ఇప్పుడు తెలుగులో ప్రతీ స్టార్ డైరక్టర్ ముందుకు తీసుకువెళ్తున్నారు. బాహుబలి చిత్రంతో రాజమౌళి తెలుగు సినిమా మార్కెట్ ని ఒక్కసారిగా ప్రపంచానికి చాటాడు. ఆ లీడ్ తీసుకుని పుష్ప వంటి చిత్రాలు అక్కడ సెన్సేషన్ క్రియేట్ చేసాయి. ఆ తర్వాత ఆర్.ఆర్.ఆర్ చిత్రం ప్యాన్ వరల్డ్ బిజినెస్ మొదలెట్టి మళ్లీ లీడ్ ఇచ్చింది. దాన్ని అందరూ అనుసరించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అదే క్రమంలో  ఇప్పుడు పుష్ప ఇచ్చిన లీడ్ ని రామ్ చరణ్ కు ఉపయోగపడబోతోందని సోషల్ మీడియా అంటోంది. ఆ లెక్కలు ఏమిటంటే...

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతున్న పుష్ప 2 చిత్రం కు నార్త్ లో ఓ రేంజిలో క్రేజ్ ఉంది. అది ఖచ్చితంగా రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్ లో ప్రారంభం కాబోయే చిత్రానికి పనికి వస్తుందని అంటున్నారు. హోలీ సందర్భంగా ఆర్సీ17 కూడా అనౌన్స్ చేసేశారు. ఈసారి సుకుమార్ తో రామ్ చరణ్ `రంగస్థలం` తర్వాత మరోసారి చేతులు కలవటం అదిరిపోయే స్ట్రాటజీ అంటున్నారు. ఇది చరణ్‌ బర్త్ డే సందర్భంగా భలే  కలిసి వచ్చిందని అంటున్నా

ఇక రామ్ చరణ్, సుకుమార్ కాంబో ఆరేళ్ల కిందట రంగస్థలం మూవీతో ఎలాంటి మ్యాజిక్ చేసిందో మనకు తెలుసు. చరణ్ కెరీర్లోని అతి పెద్ద హిట్స్ లో అదీ ఒకటి. ఇక ఇప్పుడు ఈ ఇద్దరూ మళ్లీ చేతులు కలపబోతున్నారంటేనే అభిమానుల్లో ఓ రేంజ్ అంచనాలు ఏర్పడ్డాయి. వాస్తవానికి  పుష్ప 2 ఈ ఏడాది ఆగస్ట్ 15న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. అంత వరకూ సుకుమార్ కూడా బిజీయే. ఆ తర్వాత సుకుమార్, రామ్ చరణ్ చిత్రం ప్రారంభం అవుతుంది.

అలాగే ఈ లోగా శంకర్, రామ్ చరణ్ చిత్రం రిలీజ్ అవుతుంది. ఆ చిత్రంపై ఓ రేంజిలో ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి. ఆ క్రేజ్ చాలు సుకుమార్ తో రామ్ చరణ్ సినిమాకు హైప్ రావటానికి . మరో ప్రక్క ఆర్సీ17 అనౌన్స్‌మెంట్ రాగానే అభిమానుల్లో అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఇప్పుడు కార్తికేయ ట్వీట్ తో అవి కాస్తా రెట్టింపయ్యాయి. రంగస్థలం మూవీ చరణ్ కెరీర్లో ఓ మైలురాయిగా నిలిచిపోయింది. ఇప్పుడతనితో మరెలాంటి మ్యాజిక్ సుకుమార్ చేస్తాడో అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది.
 

click me!