మహేష్ కు విలన్ ఫిక్స్!

By Surya PrakashFirst Published Jun 1, 2021, 8:41 AM IST
Highlights

మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. పరశు రామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ముద్దుగుమ్మ కీర్తిసురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇటీవలే ఈ సినిమా దుబాయ్ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ఆతర్వాత హైదరాబాద్ లో షూటింగ్ చేద్దాం అనుకున్నా కరోనా కారణంగా ఆగిపోయింది. 

యాక్షన్ సినిమాలకే కాదు స్టార్స్ ఉన్న మామూలు సినిమాలకు కూడా విలన్  లేదా నెగిటివ్ క్యారక్టర్స్ ప్రధానమే. అవి ఎంత స్ట్రాంగ్ గా ఉంటే కథ అంత బాగా పరుగెడుతుంది. సినిమాకు కలిసి వస్తుంది. ‘గీత గోవిందం’ ఫేమ్‌ పరశురామ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న‘సర్కారు వారి పాట’  చిత్రంలో కథ ప్రకారం స్ట్రాంగ్ విలన్ కావాలి. అలాగే బుద్ది బలంతో మైండ్ గేమ్ ఆడాలి. అలాంటి పాత్ర ని ఎవరి చేత చేయిస్తే బాగుంటుందనే విషయమై గత కొంతకాలంగా టీమ్ సెర్చింగ్ చేసిందిట.

 చివరకు అరవింద్ స్వామి దగ్గరకు వచ్చి ఆగిందని సమాచారం. జాన్ అబ్రహం, విజయ్ సేతుపతి, ఉపేంద్ర, వివేక్ ఒబెరాయ్… ఇలా విలన్ పాత్ర కోసం చాలా పేర్లు వినిపించాయి. కానీ ఏదీ వర్కౌట్ కాలేదు.చివరకు అరవింద్ స్వామినే ఫిక్స్ చేద్దామనే ఆలోచనలో ఉన్నారని సమాచారం.

  ‘సర్కారు వారి పాట’ ఇప్పటికే 40 రోజుల షూటింగ్ పూర్తి చేసుకొంది. ఈ సినిమా షూటింగ్ మళ్లీ జులైలో మొదలయ్యే అవకాసం ఉంది. కరోనా రెండో వేవ్ పూర్తిగా తగ్గుముఖం పడితే మళ్ళీ షూటింగులు మొదలెడదామనే ఆలోచనలో నిర్మాతలు ఉన్నారు.  

 ప్రస్తుతం మహేష్ కథన కుటుంబ సభ్యులతో ఇంట్లోనే గడుపుతున్నాడు. ఇక ఈ సినిమా కథ బ్యాంకింగ్ రంగంలో జరిగే మోసాల నేపథ్యంలో ఉంటుందని అంటున్నారు. బ్యాంక్ లను బురిడీ కొట్టించి వేల కోట్లు ఎగ్గొట్టిన కేటుగాళ్లను పట్టుకునేందుకు మహేష్ రంగంలోకి దిగుతాడని అంటున్నారు. అయితే  కరోనా కారణంగా షూటింగ్ కాస్త ఆలస్యం అవుతున్నా కూడా అనుకున్న తేదీకి అంటే వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల మాత్రం పక్కా అన్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.

ఈ సినిమాలో మహేశ్‌ మాస్‌ లుక్‌లో ఆకట్టుకోబోతున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ తో ..చెవి పోగుతో మెడపై రూపాయి టాటూతో సరికొత్తగా కనిపించారు. ‘హ్యాట్రిక్‌ కోసం బ్లాక్‌బస్టర్‌ ఆరంభం’ అని పేర్కొన్నారు.

మ‌హేశ్‌బాబు సరసన కీర్తీ సురేశ్‌  మొదటిసారి నటిస్తున్నారు. ఇక వెన్నెల కిషోర్, సుబ్బరాజులు కీలక పాత్రలో కనిపించన్నారు. అంతేగాక ఇతర భారీ తారాగణం నటిస్తున్నఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫి: మ‌ధి, ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్, ఆర్ట్ డైరెక్టర్: ఏ ఎస్ ప్రకాష్, ఫైట్ మాస్టర్: రామ్ - లక్ష్మణ్, పిఆర్ఓ: బి.ఏ.రాజు, లైన్ ప్రొడ్యూసర్: రాజ్ కుమార్, కో డైరెక్టర్: విజయ రామ్ ప్రసాద్, సీఈఓ: చెర్రీ, నిర్మాతలు: నవీన్ ఎర్నేని , రవిశంకర్ యలమంచిలి, రామ్ ఆచంట, గోపి ఆచంట,రచన, దర్శకత్వం: పరశురామ్ పెట్ల‌. 

click me!