#Oscar2023:ఆస్కార్ గెలిచిన చిత్రాలు ఏ OTT లో చూడచ్చు?

Published : Mar 13, 2023, 05:30 PM IST
  #Oscar2023:ఆస్కార్ గెలిచిన చిత్రాలు ఏ  OTT లో చూడచ్చు?

సారాంశం

 చాలా మంది సినిమా ప్రేమికులు..ఆస్కార్ అవార్డ్ వచ్చిన చిత్రాలు చూడాలని వెతుకులాట మొదలైంది. ఈ క్రమంలో ఆస్కార్ సొంతం చేసుకున్న చిత్రాలు ఏ ఓటిటిలో ఉన్నాయో లిస్ట్ ఇస్తున్నాం.  


మొత్తానికి అందరి ఆశలు, ఆకాంక్షలు తీర్చుతూ  ఇండియన్‌ సినిమా సత్తా చాటింది. సినీ పరిశ్రమలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్‌.. తెలుగు పాట ‘నాటు నాటు’ను వరించింది. ‘బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌’ విభాగంలో ఆర్‌ఆర్‌ఆర్‌లోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్‌ వచ్చింది.  ఆదివారం (మార్చి 12) రాత్రి 8 గంటలకు(భారత కాలమానం ప్రకారం మార్చి 13 ఉదయం 5.30 గంటలకు)  లాజ్‌ ఏంజిల్స్‌ అత్యంత ఘనంగా ఈ కార్యక్రమం జరిగింది.  23 విభాగాల్లో విజేతలను ప్రకటించి అవార్డులను అందజేశారు. 
 
భారతీయ సినీ ప్రేక్షకుల కలను అడుగు దూరంలో నిలిపిన ‘ఆర్‌ఆర్‌ఆర్’లోని ‘నాటు నాటు’ ఈ ఏడాది ఆస్కార్‌  వేడుకలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. అలాగే  భారతీయ డాక్యుమెంటరీ షార్ట్‌ ‘ది ఎలిఫెంట్‌ విష్పరర్స్‌’ ఆస్కార్‌ను సొంతం చేసుకుంది. ఈ నేఫధ్యంలో ఎప్పటిలాగే  చాలా మంది సినిమా ప్రేమికులలో..ఆస్కార్ అవార్డ్ వచ్చిన చిత్రాలు చూడాలని తహతహ మొదలైంది. ఆ చిత్రాలు ఎక్కవ ఉన్నాయో అనే వెతుకులాట మొదలైంది. ఈ క్రమంలో ఆస్కార్ సొంతం చేసుకున్న చిత్రాలు ఏ ఓటిటిలో ఉన్నాయో లిస్ట్ ఇస్తున్నాం.

1. Everything Everywhere All at Once - SonyLiv.

2. All Quiet on the Western Front - Netflix.

3. The Whale - Not Streaming in India.

4. Black Panther: Wakanda Forever - Disney+ Hotstar.

5. Avatar: The Way of Water - Not Available to Stream. 

6. Top Gun: Maverick - Amazon Prime India.

7. RRR - Zee5 and Disney+ Hotstar. 

8. The Elephant Whisperers - Netflix.

9. Pinocchio - Netflix.

10. Women Talking - Not available to stream in India. 

11. Navalny - Not streaming in India

 ఇక ఆస్కార్ లో అత్యధిక అవార్డులు అందుకున్న చిత్రం ఎవరీ థింగ్ ఎవరీ వేర్ అల్ ఎట్ ఒన్స్ (Everything Everywhere All at Once). మొత్తం 7 కేటగిరీలో ఈ సినిమా అవార్డులను కైవసం చేసుకుంది. బెస్ట్ పిక్చర్, బెస్ట్ యాక్ట్రెస్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్, బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్, బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే, బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్ విభాగాల్లో అవార్డ్స్ ని అందుకొని సంచలనం సృష్టించింది. ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డ్స్ లో కూడా ఈ సినిమా అధిక స్థాయిలో అవార్డులను అందుకుంటూ వచ్చింది. ఈ సినిమాని డేనియల్ క్వాన్ మరియు డేనియల్ స్కీనెర్ట్ రచించి, డైరెక్ట్ చేశారు. మిచెల్ యో మెయిన్ లీడ్ లో నటించగా.. కే హుయ్ క్వాన్, జామీ లీ కర్టిస్ ప్రధాన పత్రాలు పోషించారు. మల్టీవర్స్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: ఇమ్మూ, తనూజ కాదు, కామనర్స్ టార్గెట్... సూట్ కేసు తెచ్చేది ఎవరు?
ట్రక్ డ్రైవర్ నుంచి వేలకోట్ల కలెక్షన్స్ రాబట్టే స్థాయికి ఎదిగిన డైరెక్టర్.. ప్రపంచం మొత్తం ఫిదా