‘నాటు నాటు’ సాంగ్ కు ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డు దక్కడం సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ రెడ్డి కూడా స్పందించారు.
దర్శకధీరుడు ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్ అవార్డును దక్కించుకోవడం దేశవ్యాప్తంగా పండగ వాతావరణాన్ని తీసుకొచ్చింది. ఈ చిత్రంలోని సెన్సేషనల్ ‘నాటు నాటు’ సాంగ్ కు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో Oscar2023 అవార్డు దక్కింది. ఈ ఉదయమే 95వ అకాడమీ అవార్డులను ప్రకటించారు. ఆస్కార్ వేదికపై ఎంఎం కీరవాణి, చంద్రబోస్ అవార్డును స్వీకరించారు. తమ స్పీచ్ తో ఆకట్టుకున్నారు.
అయితే.. రెండుమూడు రోజుల కింద కూడా ఆస్కార్ అవార్డుపై చాలా ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ (Tammareddy Bhardwaj) ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన కామెంట్లపై చాలా విమర్శలను సైతం ఎదుర్కొన్నారు. ఇక ఇవాళ ‘నాటు నాటు’ సాంగ్ కు ఆస్కార్ అవార్డు దక్కడంపై తమ్మారెడ్డి భరద్వాజ రియాక్షన్ ఎలా ఉంటుందనే దానిపై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు..
ఓ వీడియో విడుదల చేస్తూ ‘నాటు నాటు’ ఆస్కార్ సాధించడం పట్ల తన అభిప్రాయాన్ని వ్యక్త పరిచారు. ఆయన మాట్లాడుతూ.. ‘నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు దక్కడం చాలా గర్వంగా ఉంది. నాకే కాదు.. సినిమాను ప్రేమించే వారికి, సంగీతాన్ని ప్రేమించేవారికి ఈపాటకు ఆస్కార్ దక్కించుకోవడం గర్వించదగ్గ క్షణమేనని అన్నారు.
మనకు తెలుగు సినిమాల్లో తెలుగు సంగీతాన్ని, తెలుగుదనాన్ని అందించే తక్కువ సంగీత దర్శకుల్లో కీరవాణి గారు ఒకరు. అలాగే తెలుగు సాహిత్యం బాగా తెలిసిన చంద్రబోస్, కీరవాణి ఒకటి కావడంతో ఆస్కార్ రావడం సంతోషం. తొలిసారిగా ఇండియన్ సినిమాకు రావడం.. అందులోనూ మన తెలుుగు సినిమాకు ఆస్కార్ రావడం ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా కీరవాణి, చంద్రబోస్, ఎస్ ఎస్ రాజమౌళి, ఆర్ఆర్ఆర్ టీమ్ కు హ్రుదయపూర్వ శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.