క్రిష్ వ‌ల్ల సిరివెన్నెల అప్ సెట్‌..అసలేం జ‌రిగింది ?

Surya Prakash   | Asianet News
Published : Sep 06, 2021, 01:03 PM IST
క్రిష్ వ‌ల్ల సిరివెన్నెల అప్ సెట్‌..అసలేం జ‌రిగింది ?

సారాంశం

 ప్రముఖ దినపత్రిక వీరిద్దరు ఇంటర్వూని పబ్లిష్ చేసింది. అందులో క్రిష్ వల్ల సిరివెన్నెల అప్ సెట్ అయిన విషయం ప్రస్తావించారు. అదిప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ క్రిష్ ఏమన్నారో ఆయన మాటల్లోనే చూద్దాం.  

డైరక్టర్ క్రిష్, పాటల రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి మధ్య ప్రత్యేకమైన అనుబంధం ఉంది. క్రిష్ ఎప్పుడూ శాస్త్రి గారిని తెలుగు ఇండస్ట్రీ పిల్లర్స్ లో ఒకరిగా అభివర్ణిస్తూంటారు. శాస్త్రి గారు సైతం క్రిష్ ని మొదట చిత్రం గమ్యం నుంచి సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్బంగా ప్రముఖ దినపత్రిక వీరిద్దరు ఇంటర్వూని పబ్లిష్ చేసింది. అందులో క్రిష్ వల్ల సిరివెన్నెల అప్ సెట్ అయిన విషయం ప్రస్తావించారు. అదిప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ క్రిష్ ఏమన్నారో ఆయన మాటల్లోనే చూద్దాం.

క్రిష్ మాట్లాడుతూ...‘కృష్ణం వందే జగద్గురమ్‌’ సినిమాలో గురువుగారు ఓ 14 నిమిషాల పాట రాశారు. ఇప్పుడైతే ఒప్పుకునేవాడినేమో! అప్పుడు నాకు దర్శకుడిగా తెలుగులో మూడో సినిమాయే. ఏదో అపనమ్మకం. నేను సినిమాగా చూస్తూ ఎడిటింగ్‌ గురించి ఆలోచిస్తున్నాను. గురువుగారేమో పాటగా చూస్తున్నారు. ఓ రెండు మూడు చరణాలు నేను వాడలేదు. అప్పుడు నేను గురువుగారి మాట వినలేదు. అందుకు ఆయన అలిగారు.

సిరివెన్నెల మాట్లాడుతూ...మనిషి అనే మూడు అక్షరాల పదాన్ని పట్టుకుని నిరంతరం పాకులాడటం అనేది మా ఇద్దరికీ ఉన్న కామన్‌ పాయింట్‌. ఒక మనిషిని 360 కోణాల్లో ఏ విధంగానైనా చూడొచ్చు. అలా క్రిష్‌ ఏ కథ చెప్పినా మనిషి గురించే చెప్పాడు. ఆ విధంగా క్రిష్‌ వివిధ విధాలుగా ఒకటే సినిమా తీశాడు. నేనూ ఒకటే పాట రాశాను. కాకపోతే వివిధ రకాలుగా... మనిషి గురించి. ఒక సినిమా చూస్తూ వందమంది చప్పట్లు కొడతారు. ఒక్క మనిషి చప్పట్లు కొట్టకుండా ఉంటాడు. చప్పట్లు కొట్టడం కూడా మరిచిపోయేంతలా సినిమాలో లీనం అయితే అది సార్థకి. అలాంటివాడు ఒక్కడైనా చాలు.. అయితే ఆశయంతో.. కాదు పొగరుబోతుతనంతో పని చేస్తున్నాడు. క్రిష్‌ డైరెక్షన్‌లో వచ్చిన ప్రతి సినిమా నాకు ఇష్టమే. ‘గమ్యం’ సినిమా ట్రెండ్‌ సెట్టర్‌. కానీ ‘కంచె’ ఓ అద్భుతం... మాస్టర్‌పీస్‌ అన్నారు.
 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా