'భవదీయుడు భగత్ సింగ్'.. అదిరిపోయిందిగా, పవన్ నెక్స్ట్ మూవీ టైటిల్ ఇదే ?

By telugu teamFirst Published Sep 6, 2021, 10:32 AM IST
Highlights

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తదుపరి చిత్రాల లైనప్ ఆసక్తికరంగా ఉంది. ప్రస్తుతం పవన్ భీమ్లా నాయక్, హరిహర వీరమల్లు చిత్రాల్లో నటిస్తున్నాడు.  చిత్రాలు పూర్తయ్యాక హరీష్ శంకర్ దర్శకత్వంలో చిత్రం షురూ అవుతుంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తదుపరి చిత్రాల లైనప్ ఆసక్తికరంగా ఉంది. ప్రస్తుతం పవన్ భీమ్లా నాయక్, హరిహర వీరమల్లు చిత్రాల్లో నటిస్తున్నాడు.  చిత్రాలు పూర్తయ్యాక హరీష్ శంకర్ దర్శకత్వంలో చిత్రం షురూ అవుతుంది. పవన్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్న కాంబినేషన్స్ లో ఇది కూడా ఒకటి. 

గతంలో వచ్చిన గబ్బర్ సింగ్ రిజల్ట్ అందరికీ తెలిసిందే. ఏళ్ళు గడుస్తున్నా గబ్బర్ సింగ్ మానియా కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు రాబోతున్న రెండవ చిత్రం అంతకు మించే విధంగా ఉండాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. దర్శకుడు హరీష్ శంకర్ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఉన్నారు. 

ఈ నేపథ్యంలో పవన్ చిత్రానికి హరీష్ శంకర్ అదిరిపోయే టైటిల్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. పవన్ ఈ మూవీలో డ్యూయెల్ రోల్ లో నటించనున్నాడట. ఈ చిత్రం కోసం 'భవదీయుడు భగత్ సింగ్' అనే పవర్ ఫుల్ టైటిల్ ని పరిశీలిస్తున్నారట. దీనితో ఈ న్యూస్ వైరల్ గా మారింది. 

పవన్ కళ్యాణ్ ఇమేజ్ కు పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే టైటిల్ అని కామెంట్స్ వస్తున్నాయి. ఈ టైటిల్ ఇంకా ఫిక్స్ కాలేదని వర్కింగ్ టైటిల్ మాత్రమే అని కూడా అంటున్నారు. గతంలో సంచారి అనే టైటిల్ కూడా ప్రచారం జరిగింది. అభిమానులకు నచ్చే టైటిల్ మాత్రం భవదీయుడు భగత్ సింగ్' అనే చెప్పాలి. 

ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా.. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ తర్వాత పవన్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో నటించాల్సి ఉంది. 

click me!