ధనుష్ సినిమాలో రవితేజని అడిగారు

By Surya PrakashFirst Published May 17, 2021, 12:19 PM IST
Highlights

స్క్రిప్టు రవితేజకు తెగ నచ్చేసింది. కానీ తన బిజి షెడ్యూల్స్ తో డేట్స్ ఎడ్జెస్ట్ చేయలేనని చేతులెత్తేసాడు. ఆ తర్వాత తమిళ దర్శకుడు అమీర్ సుల్తాన్ ని కలిసాడు. ఆయన కథ కూడా వినకుండా సైన్ చేసేసారు. ఆ విషయం ఇన్నాళ్లకు గుర్తు చేసుకున్నారు వెట్రిమారన్.

చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే...నేషనల్ అవార్డ్ విన్నర్ వెట్రిమారన్ డైరక్షన్ లో రవితేజకు ఛాన్స్ వచ్చిందని. ఆయన ధనుష్ తో 2018లో తీసిన క్రైమ్ డ్రామా వడా చెన్నైలో కీ రోల్ చెయ్యాల్సిందని. అయితే అప్పటికు ఉన్న సిట్యువేషన్ లో డేట్స్ కుదరక నో చెప్పేసాడు రవితేజ. ఈ విషయాన్ని స్వయంగా వెట్రిమారన్ ..క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ తో జరిగిన సోషల్ మీడియా ఇంట్రాక్షన్ లో తెలియచేసారు.

వెట్రిమారన్ మొదట వడా చెన్నై స్క్రిప్టుని విజయ్ సేతుపతి కు చెప్పారు. నార్త్ మద్రాస్ స్మగ్లర్ రాజన్ రోల్ పోషించమని అడిగారు. విజయ్ సేతుపతికు ఆ పాత్ర నచ్చినా ప్యాకెడ్ షెడ్యూల్ తో ముందుకు వెళ్లలేదు. అప్పుడు ఆ డైరక్టర్ మనస్సులోకి వెంటనే వచ్చింది రవితేజనే. వెంటనే పాండిచ్చేరిలో ఉన్న రవితేజని షూటింగ్ టైమ్ లో వెళ్లి కలిసారు. కథను నేరేట్ చేసారు. స్క్రిప్టు రవితేజకు తెగ నచ్చేసింది. కానీ తన బిజి షెడ్యూల్స్ తో డేట్స్ ఎడ్జెస్ట్ చేయలేనని చేతులెత్తేసాడు. ఆ తర్వాత తమిళ దర్శకుడు అమీర్ సుల్తాన్ ని కలిసాడు. ఆయన కథ కూడా వినకుండా సైన్ చేసేసారు. ఆ విషయం ఇన్నాళ్లకు గుర్తు చేసుకున్నారు వెట్రిమారన్.
  
ఇక తమిళ ప్రముఖ నటుడు ధనుష్‌ హీరోగా నటించిన చిత్రం ‘వడా చెన్నై’. ఈ చిత్రాన్నికి విలక్షణ దర్శకుడు వెట్రి మారన్‌ దర్శకత్వ వహించారు. లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ సమర్పించిన ఈ చిత్రాని వండర్‌బార్‌ ఫిల్మ్స్‌ పతాకంపై నిర్మించారు. ఐశ్వర్య రాజేశ్‌, ఆండ్రియా, సముద్రఖని, ప్రధాన పాత్రలు పోషించారు. కాగా సంతోష్‌ నారాయణ్‌ బాణీలు అందించారు. ఈ సినిమా భాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అయ్యింది. చెన్నైలోని ఓ ప్రాంతానికి చెందిన ప్రజల జీవిత కథలను ఈ 'వడా చెన్నై' సినిమాలో చూపించాపు. 

click me!