అప్పటి నుంచి ‘సలార్’ ప్రమోషన్స్ లో ప్రభాస్.. ఇండియాకు ఎప్పుడొస్తారంటే?

By Asianet News  |  First Published Oct 30, 2023, 11:58 AM IST

పాన్ ఇండియా స్టార్ ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు. ‘సలార్’  చిత్రం రిలీజ్ సమయం దగ్గరపడుతోంది. ఈ క్రమంలో ప్రమోషన్స్ పై ఆసక్తి నెలకొంది. తాజాగా డార్లింగ్ ఇండియాకు కూడా వచ్చేందుకు రెడీ అయ్యారు.. 
 


యంగ్ రెబల్ స్టార్, పాన్ ఇండియా హీరో ప్రభాస్ (Prabhas)  సినిమాలకు ఏరేంజ్ లో క్రేజ్ ఉంటుందో తెలిసిందే. సినిమా కథ, ఇతర అంశాలేవైనా మనోడి సినిమాకు మార్కెట్ లో ఫుల్ డిమాండ్ ఉంటుంది. అలాంటిది ‘కేజీఎఫ్’ లాంటి బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ తెరకెక్కించిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్’ (Salaar)  రాబోతుండటంతో ఆ సినిమాకు ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో తెలిసిందే. అయితే ఈ చిత్రం మరో 50 రోజుల్లో థియేటర్లలోకి రానుంది. వరల్డ్ మార్కెట్ ను టార్గెట్ చేసిన మేకర్స్ ఈ మూవీ ప్రమోషన్స్ ను ఎలా చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.

ఇప్పటికే ప్రభాస్ బర్త్ డేకు యూఎస్ ఏలోని పలు స్క్రీన్లపై ప్రచారం చేశారు. ఇక సినిమా విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో ప్రమెషన్స్ ను ఎప్పుడూ ప్రారంభిస్తారనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇక ప్రభాస్ కూడా ఇండియాలో లేకపోవడం మరో విషయం.. అయితే వీటిన్నింటినీ సరిచేసేందుకు డార్లింగ్ ప్లాన్ చేశాడంట. ప్రభాస్ మోకాలీ సర్జరీ కారణంగా యూరోప్ కు వెళ్లారు. ప్రస్తుతం చికిత్స పూర్తవడంతో తిరిగి రాబోతున్నారంట.

Latest Videos

undefined

కొన్ని నివేదికల ప్రకారం.. నవంబర్ 6న డార్లింగ్ ఇండియాలో అడుగుపెట్టబోతున్నారు. రానే ‘సలార్’ ప్రమోషన్స్ పై చిత్ర మేకర్స్ హోంబలే ఫిల్మ్స్ నిర్మాతలతో చర్చించనున్నారంట. ఇంకాస్తా సమయం ఉండటంతో అటు మారుతీ చిత్రానికి సంబంధించిన మరో షెడ్యూల్ ను కూడా ప్రారంభించాలని ఆలోచిస్తున్నారంట. ఈ షెడ్యూల్ తర్వాతనే ‘సలార్’ ప్రమోషన్స్ లోకి డార్లింగ్ దిగనున్నారని సమాచారం. 

‘సలార్’ చిత్రంపై వరల్డ్ వైడ్ గా హైప్ క్రియేట్ అయ్యింది. దీంతో యూనిట్ తమ ప్రమోషన్స్ తో ఇంకెలా ప్రేక్షకుల ఆసక్తిని మళ్లీస్తారో చూడాలి. తెలుగు స్టేట్స్ లో, హిందీ బెల్ట్ లో సినిమాకు మంచి రెస్పాన్సే ఉంది. ఇక ఓవర్సీస్ లో ఎలాంటి ప్రచారం జరుగుతుందో చూడాలంటున్నారు.  చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్  నిర్మిస్తోంది. శృతి హాసన్ హీరోయిన్. జగపతి బాబు, పృథ్వీ రాజ్ సుకుమారన్ విలన్స్ గా మెప్పించనున్నారు. రవి బర్సూర్ సంగీతం అందిస్తున్నారు. డిసెంబర్ 22న చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. 

click me!