రజినీకాంత్ ముఖానికి లిప్స్టిక్... ఆ పని చేసింది ఎవరో తెలుసా!

By team teluguFirst Published Nov 5, 2021, 9:51 AM IST
Highlights

ఓ సందర్భంలో రజినీకాంత్ ముఖానికి లత లిప్స్టిక్ వేశారు. ఆయన కళ్ళ చుట్టూ ఆమె లిప్స్టిక్ పూయడం జరిగింది. భార్య కొంటె పనులను రజినీకాంత్ ఎంజాయ్ చేస్తున్నట్లు, ఆ ఫోటో ద్వారా అర్థం అవుతుంది.

తెరపై గంభీరంగా కనిపించే సూపర్ స్టార్ రజినీకాంత్, ఇంట్లో మాత్రం చిన్నపిల్లాడే. భార్య, పిల్లల వద్ద ఆయన చాలా జోవియల్ గా ఉంటారు. ముఖ్యంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య లతతో Rajinikanth చాలా అన్యోన్యంగా ఉంటారు. దానికి కూతురు ఐశ్వర్య రజినీకాంత్ పంచుకున్న ఫోటోనే నిదర్శనం. 


ఓ సందర్భంలో రజినీకాంత్ ముఖానికి లత లిప్స్టిక్ వేశారు. ఆయన కళ్ళ చుట్టూ ఆమె లిప్స్టిక్ పూయడం జరిగింది. భార్య కొంటె పనులను రజినీకాంత్ ఎంజాయ్ చేస్తున్నట్లు, ఆ ఫోటో ద్వారా అర్థం అవుతుంది. రజినీ-లత పెళ్లి రోజు పురస్కరించుకొని గతంలో ఐశ్వర్య ఆ రేర్ ఫోటో షేర్ చేయడం జరిగింది. 1981 ఫిబ్రవరి 26న రజినీకాంత్, Latha rajinikanth మెడలో తాళికట్టాడు. వీరిద్దరిదీ ప్రేమ వివాహం.

 
లవ్ యట్ ఫస్ట్ సైట్ అన్నట్లు మొదటి చూపులోనే లత ప్రేమలో పడిపోయాడు రజినీకాంత్. లత కాలేజ్ లో చదువుకుంటున్న రోజుల్లో ఓ ఇంటర్వ్యూ కోసం రజినీకాంత్ ని కలిశారు. ఇంటర్వ్యూలో లత మాటతీరు, అందానికి ముగ్దుడైన రజినీకాంత్, వెంటనే పెళ్లి చేసుకుంటావా అని అడిగారు. దానికి లత... పేరెంట్స్ ని అడిగి చెబుతానని సమాధానం చెప్పారు. అప్పటికే సూపర్ స్టార్ గా ఉన్న రజినీకాంత్ తో పెళ్ళికి లత పేరెంట్స్ పచ్చ జెండా ఊపడంతో, ఒక్కటయ్యారు. దాదాపు నలబై ఏళ్లుగా రజినీ, లత అన్యోన్య దంపతులుగా ఉన్నారు. 

Also read దివాళీ వేళ రెచ్చిపోయిన చూపించిన రాశి ఖన్నా... రెడ్ చోళీ లెహంగాలో నడుము, నాభీ చూపిస్తూ రచ్చ!
మరోవైపు నిన్న విడుదలైన రజినీకాంత్ Annaatthe పూర్తి నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. రజినీకాంత్ కెరీర్ లోనే చెత్త సినిమాగా దీనిని వర్ణిస్తున్నారు. అవుట్ డేటెడ్ స్టోరీ, లాజిక్ లేని ఫైట్స్ తో రజినీకాంత్ ప్రేక్షకులను నిరాశపరిచినట్లు రిపోర్ట్స్ వస్తున్నాయి. దర్శకుడు శివపై ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఇలాంటి చెత్త సినిమాతో తమ హీరోతో తీసినందుకు సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ చేస్తున్నారు.  దీనికి పోటీగా విడుదలైన విశాల్... ఎనిమీ పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం విశేషం. 

Also read Anna leznheva: పవన్ భార్యపై ఈ రూమర్ నిజమేనా..?
 

click me!