చరణ్ చేయాల్సిన మూవీ అల్లు అర్జున్ చేతిలో పెట్టిన చిరు..! 

Published : Feb 01, 2023, 04:03 PM ISTUpdated : Feb 01, 2023, 04:16 PM IST
చరణ్ చేయాల్సిన మూవీ అల్లు అర్జున్ చేతిలో పెట్టిన చిరు..! 

సారాంశం

అల్లు అర్జున్ డెబ్యూ మూవీ విషయంలో జరిగిన ఆసక్తికర విషయాన్ని నాగబాబు తెలియజేశారు. చరణ్ చేయాల్సిన సినిమా అల్లు అర్జున్ చేశాడంటూ వివరించారు.   

అల్లు అర్జున్-రామ్ చరణ్ టాలీవుడ్ టాప్ స్టార్స్ గా ఎదిగారు. పాన్ ఇండియా విజయాలతో దేశవ్యాప్తంగా ఫేమ్ తెచ్చుకున్నారు. అల్లు అర్జున్ పుష్ప, రామ్ చరణ్ ఆర్ ఆర్ ఆర్ వసూళ్ల వర్షం కురిపించాయి. కెరీర్లో ఒకరికి మించి మరొకరు ముందుకు వెళుతున్నారు. కాగా వీరిద్దరి సిల్వర్ స్క్రీన్ ఎంట్రీకి చాలా గ్యాప్ ఉంది. 2003లో అల్లు అర్జున్  హీరో అయ్యారు. నాలుగేళ్ల తర్వాత 2007లో రామ్ చరణ్ నటుడిగా మారారు. ఆసక్తికర విషయం ఏమిటంటే బన్నీ కంటే ముందు రామ్ చరణ్ హీరో కావాల్సిందట. తాజా ఇంటర్వ్యూలో నాగబాబు ఈ విషయాన్ని బయటపెట్టారు. 

గంగోత్రి మూవీతో రామ్ చరణ్ ని హీరోగా పరిచయం చేద్దామని యూనిట్ చిరంజీవిని కలిశారట. చరణ్ ఇంకా సిద్ధం కాలేదు. కథ బాగుంది. అల్లు అర్జున్ తో చేయండి, తనకు బాగా సెట్ అవుతుందని సలహా ఇచ్చారట. దీంతో గంగోత్రి ఆఫర్ అల్లు అర్జున్ వద్దకు వెళ్ళింది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తన మార్క్ కామెడీ, లవ్, ఎమోషన్స్ కలగలిపి పక్కా యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా రూపొందించారు. 

2003 మార్చి 28న సమ్మర్ కానుకగా విడుదలైన గంగోత్రి హిట్ టాక్ తెచ్చుకుంది. అల్లు అర్జున్ లుక్స్ పై నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. అయితే ఆయనకు ఫస్ట్ హిట్ పడింది. కీరవాణి మ్యూజిక్ హైలెట్ అయ్యింది. గంగోత్రి మూవీతో హీరో అయిన అల్లు అర్జున్ ఆర్య మూవీతో హీరోగా నిలదొక్కుకున్నాడు. అక్కడి నుండి ఆయనకు ఫ్యాన్ బేస్ ఏర్పడింది. 

ఇక రామ్ చరణ్ ని దర్శకుడు పూరి జగన్నాధ్ పరిచయం చేశాడు. పోకిరి మూవీతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన పూరి నంబర్ వన్ డైరెక్టర్ గా అవతరించాడు. దాంతో చిరంజీవి తన కుమారుడిని ఇంట్రడ్యూస్ చేసే బాధ్యత రామ్ చరణ్ కి ఇచ్చారు. చిరు నమ్మకాన్ని నిలబెడుతూ పూరి హిట్ ఇచ్చాడు. 2007లో చరణ్ డెబ్యూ మూవీగా విడుదలైన చిరుత పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే భారీ హిట్ అని చెప్పలేం. చరణ్ మొదటి సినిమాలోనే డాన్సులు, యాక్షన్ సన్నివేశాలు ఇరగదీశాడు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Kokkoroko మూవీతో అలరించేందుకు వస్తోన్న యంగ్‌ సెన్సేషన్‌.. కొత్త పోస్టర్‌ అదిరింది
Dhoolpet Police Station Review: `ధూల్‌పేట్‌ పోలీస్‌ స్టేషన్‌` కేస్‌ 1 వెబ్‌ సిరీస్‌ రివ్యూ.. చూపు తిప్పుకోలేరు