నానిని దారుణంగా అవమానం చేసిన డైరక్టర్ అతనేనా?

By Surya PrakashFirst Published Mar 24, 2023, 1:51 PM IST
Highlights

అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉంటే.. అందులోనూ క్లాప్ అసిస్టెంట్ గా ఉంటే ఎన్నో అవమానాలు పడాల్సి ఉంటుందని అన్నారు. ఎవరైనా సరే ఏదైనా చెప్పేయవచ్చునని అనుకుంటారని.. 

నేచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం దసరా. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. నాని వరుస పెట్టి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. దక్షిణాదితో పాటు బాలీవుడ్ లో కూడా వరుసగా ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. 

కెరీర్ తొలినాళ్లలో తాను పడ్డ అవమానాల గురించి నాని రీసెంట్ గా దసరా చిత్రం ప్రమోషన్ లో  ఓ ఇంటర్వూలో  చెప్పుకొచ్చారు. ఓ దర్శకుడైతే అందరి ముందు తనను అవమానించాడని అన్నారు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా పరిశ్రమలోకి వచ్చారు కదా.. మొదట్లో ఏమైనా కష్టంగా అనిపించిందా? అని జర్నలిస్ట్ ప్రశ్నించాడు. దీనికి నాని సమాధానమిస్తూ.. ఈ విషయాలు ప్రస్తావనకు తెచ్చారు. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో కష్టంగా అనిపించిందని అన్నారు.

అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉంటే.. అందులోనూ క్లాప్ అసిస్టెంట్ గా ఉంటే ఎన్నో అవమానాలు పడాల్సి ఉంటుందని అన్నారు. ఎవరైనా సరే ఏదైనా చెప్పేయవచ్చునని అనుకుంటారని.. ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారని.. అయితే వారికి గట్టిగా సమాధానం చెప్పాలని ఉన్నా అన్నిటినీ దిగమింగక తప్పదని అన్నారు. క్లాప్ బోర్డు ఆలస్యమైనా ఏదో ఒకటి అనేవారని.. అయితే మాటలు పడినందుకు తానెప్పుడూ బాధపడలేదని అన్నారు. కానీ ఒక దర్శకుడు మాత్రం సెట్ లో అందరి ముందు తనను అవమానించాడని, ఎప్పటికీ దర్శకుడివి కాలేవురా అని అన్నాడని గుర్తు చేసుకున్నారు. ఆ మాట తనను తీవ్ర మనోవేదనకు గురి చేసిందని, ఇలాంటి ఎన్నో విమర్శలు, అవమానాలు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చానని అన్నారు. స్టార్ హీరో అయ్యాక ఆ దర్శకుడ్ని కలిశానని.. కానీ అతని ఈగో మాత్రం తగ్గలేదని.. అప్పుడు కూడా ప్రతికూల వాతావరణమే ఉందని అన్నారు. ఈ క్రమంలో ఆ దర్శకుడు ఎవరనేది అంతటా హాట్ టాపిక్ గా మారింది. 

అయితే అందుతున్న సమాచారం మేరకు ..కామెడీ చిత్రాలు తీసి ఒకప్పుడు ఒక వెలుగు వెలిగి, ఇప్పుడు ఖాళీగా ఉన్న ఓ  స్టార్ డైరక్టర్ ...నానిని అవమానించాడని తెలుస్తోంది. నాని కెరీర్ ప్రారంంలో 'రాధా గోపాలం' అనే సినిమాకు ప్రముఖ దర్శకుడు స్వర్గీయ బాపు దగ్గర అసిస్టెంట్‌గా పని చేశాడు. ఆ తర్వాత బడా డైరెక్టర్లు రాఘవేంద్రరావు, శ్రీనువైట్ల సహా పలువురి దగ్గరా చేశాడు. ఈ క్రమంలోనే ఇంద్రగంటి మోమన్‌కృష్ణ తెరకెక్కించిన 'అష్టాచమ్మా' అనే సినిమాతో నాని హీరోగా కెరీర్‌ను ప్రారంభించాడు. 

మొదటి చిత్రం 'అష్టాచమ్మా' హిట్ అయినా నానికి మాత్రం పెద్దగా గుర్తింపు దక్కలేదు. ఆ తర్వాత 'రైడ్‌', 'స్నేహితుడా', 'భీమిలీ కబడ్డీ జట్టు' వంటి సినిమాలు చేసి నటుడిగా ప్రశంసలు అందుకున్నాడు. సరిగ్గా అప్పుడే నందినీ రెడ్డి తెరకెక్కించిన 'అలా మొదలైంది'తో మొదటి బ్రేక్‌ను అందుకున్నాడు. ఆ తర్వాత 'పిల్ల జమిందార్'తో నేచురల్ స్టార్‌గా మారాడు. ఆ జర్నీ ఇప్పటి దసరాదాకా సాగుతోంది.  నాని నటించిన దసరా సినిమా మార్చి 30న విడుదల కాబోతుంది.  
 

click me!