వాట్‌ ద F** బూతు పాట తీయించేశారు.. విజయ్ ఏమంటాడో..

First Published Jul 27, 2018, 3:59 PM IST
Highlights

ఈ పాటలో ఉపయోగించిన 'ఎఫ్' అనే పదం ఆంగ్ల బూతుకి సూచన. పైగా పాటలో లిరిక్స్ చాలా అభ్యంతరకరంగా మహిళలను తక్కువగా చేసేవిధంగా ఉన్నాయి. అమెరికా గాళ్‌ అయినా.. అంటూ సాగిన ఈ పాటలో సావిత్రి నుండి సీత వరకూ ఎవర్నీ వదల్లేదు.

తన సినిమా ప్రమోషన్స్ విషయంలో నటుడు విజయ్ దేవరకొండ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. యూత్ ని ఆకర్షించే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. తాజాగా ఆయన నటించిన 'గీత గోవిందం' సినిమాలో 'వాట్ ది ఎఫ్' అంటూ ఒక లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు. విడుదల చేసిన కొద్ది గంటల్లో ఈ పాటకు విశేష ఆదరణ లభించింది. అయితే గురువారం(జూలై 26) నాడు విడుదలైన ఈ పాటను ఇప్పుడు యూట్యూబ్ నుండి తొలగించారు.

అసలు వివాదం ఏంటంటే.. ఈ పాటలో ఉపయోగించిన 'ఎఫ్' అనే పదం ఆంగ్ల బూతుకి సూచన. పైగా పాటలో లిరిక్స్ చాలా అభ్యంతరకరంగా మహిళలను తక్కువగా చేసేవిధంగా ఉన్నాయి. అమెరికా గాళ్‌ అయినా.. అంటూ సాగిన ఈ పాటలో సావిత్రి నుండి సీత వరకూ ఎవర్నీ వదల్లేదు. ''రాముడు గాని ఇప్పుడు పుట్టి జంగిల్‌కి పోదాం రారమ్మంటే సీతకు కాస్తా సిరాకు లేసి సోలోగే పొమ్మంటే'' ఇలాంటి లైన్స్ కొందరి మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉండడంతో దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ఈ పాటపై విపరీతమైన ట్రోలింగ్ నడిచింది.

దీంతో చిత్రబృందం ఈ పాటను యూట్యూబ్ నుండి తొలగించారు. ఈ పాట రాసిన రచయిత శ్రీమణి 'ఎవరి మనోభావాలు కించపరిచే విధంగా ఈ పాత రాయలేదు. రచయిత భావనను తప్పుగా అర్ధం చేసుకోవడం వలెనే వివాదమయింది. ఈ పాటపై విమర్శలు చేస్తున్నారు. అందరి మనోభావాలు గౌరవించడం మా ధర్మం. అందుకే ఈ పాటను ఎడిట్ చేసి తిరిగి అప్ లోడ్ చేస్తాం' అని వెల్లడించారు. అయితే ఈ విషయంపై విజయ్ దేవరకొండ మాత్రం ఇప్పటివరకు స్పందించలేదు. 

click me!