హన్సికతో రామ్ డేటింగ్..?

Published : Dec 01, 2018, 04:20 PM ISTUpdated : Dec 01, 2018, 04:21 PM IST
హన్సికతో రామ్ డేటింగ్..?

సారాంశం

ప్రస్తుతం టాలీవుడ్ ఫిల్మ్ నగర్ లో హీరో రామ్, హన్సిక తో డేటింగ్ లో ఉన్నాడనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. గతంలో వీరిద్దరూ కలిసిమస్కా, కందిరీగ వంటి సినిమాల్లో నటించారు. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేశాయి. 

ప్రస్తుతం టాలీవుడ్ ఫిల్మ్ నగర్ లో హీరో రామ్, హన్సిక తో డేటింగ్ లో ఉన్నాడనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. గతంలో వీరిద్దరూ కలిసి మస్కా, కందిరీగ వంటి సినిమాల్లో నటించారు. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేశాయి.

ఇప్పటివరకు రామ్ ఇండస్ట్రీలో ఏ హీరోయిన్ తో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు రాలేదు కానీ హన్సిక మాత్రం ఇక్కడ అలానే కోలివుడ్ లో కొందరితో ప్రేమాయణాలు నడిపించింది. తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు హన్సిక.. రామ్ తో డేటింగ్ చేస్తుందని టాక్.

ఇటీవల హన్సిక టాలీవుడ్ లో తనకున్న స్నేహితులను పిలిచి ప్రత్యేకంగా పార్టీ ఇచ్చిందట. ఇక్కడ అవకాశాల కోసం అమ్మడు తన పాత పరిచయాలను వాడుకోవాలని చూస్తోంది. 
అయితే ఈ పార్టీలో పాల్గొన్న కొందరు హన్సిక.. రామ్ తో డేటింగ్ లో ఉందనే విషయాన్ని చెబుతున్నారు.

రామ్ తో ఆమె మీటింగ్స్ అన్నీ స్పెషల్ గా ఉంటాయని, రెగ్యులర్ గా కలిసినట్లు రామ్ ని కలవదని అంటున్నారు. రీసెంట్ గా వీరిద్దరూ ఓ పార్టీలో పాల్గొన్నారని అప్పటినుండి  ఇద్దరూ కలిసి సమయం గడుపుతున్నారని సమాచారం. అయితే ఈ విషయంపై హన్సిక లేదా రామ్ పెదవి విప్పితే గానీ క్లారిటీ రాదు.  

PREV
click me!

Recommended Stories

Bigg Boss 9 లో ముద్దుల గోల , డార్క్ రూమ్ లో వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారు, దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు
Chiranjeevi: సౌందర్య సినిమా చూసి చేతులు కాల్చుకున్న చిరంజీవి, ఇదెక్కడి గొడవరా అని తలపట్టుకున్న డైరెక్టర్