భయపెట్టి, బెదిరిస్తున్నారంటూ అలియా భట్ తల్లి , ఖచ్చితంగా చదివాల్సిన న్యూస్

Published : May 20, 2024, 12:10 PM IST
భయపెట్టి, బెదిరిస్తున్నారంటూ అలియా భట్ తల్లి , ఖచ్చితంగా చదివాల్సిన న్యూస్

సారాంశం

డ్రగ్స్. ఢిల్లీ కస్టమ్స్ పోలీసుల నుండి ఆమెకు కాల్ వచ్చింది. ఆ తర్వాత ఆమె ఆధార్ కార్డ్ నంబర్ అడిగారు.

గత కొద్ది రోజులుగా మీకో పార్సల్ వచ్చిందంటూ.. వివిధ నగరాలకు చెందిన ప్రజల నుంచి లక్షలాది రూపాయలను దోచుకుంటున్న స్కామ్ గురించి వింటూనే ఉన్నాం.  దీనిని కొరియర్ స్కామ్ అని పిలుస్తున్నారు. ఇందుకు సంబంధించి.. మోసగాళ్లు తమను తాము పోలీసు అధికారులు, కస్టమ్ అధికారులు, NCRB ఏజెంట్‌లు చెప్పుకుంటూ ఉంటారు. మాదకద్రవ్యాలు, ఇతర నిషేధిత పదార్ధాలు వంటి నిషిద్ధ వస్తువులు ఉన్న పార్శిల్‌ మీకు వచ్చిందని చెబుతూ బెదిరింపులకు దిగుతూ ఉంటారు. 
 
మీ పేరుపై వచ్చిన కొరియర్ ఓపెన్ చేస్తే డ్రగ్స్ బయటపడ్డాయి. మీ మీద కేసు బుక్ చేయాలి అంటూ భయపెడతారు. అధికారులు చర్యలు తీసుకోకూడదనే ఉద్దేశ్యంతో మోసగాళ్ల మాటలను బాధితులు నమ్మేసి.. వారు అడిగినంత లేదంటే తమ దగ్గర ఉన్న వీలైనంత డబ్బులను లాగేసుకుంటూ ఉంటారు.  అలియా భట్ తల్లి ,ప్రముఖ నటి సోనీ రజ్దాన్ ఇలాంటి స్కామ్ లో ఇరుక్కోబోయి తప్పించుకుంది. ఈ మేరకు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్‌ను షేర్ చేసింది.   

అలియా భట్ తల్లి ఆ పోస్ట్ లో స్కామ్‌కు గురైనట్లు అభిమానులకు తెలియజేసింది, అది కూడా డ్రగ్స్. ఢిల్లీ కస్టమ్స్ పోలీసుల నుండి ఆమెకు కాల్ వచ్చింది. ఆ తర్వాత ఆమె ఆధార్ కార్డ్ నంబర్ అడిగారు. ఆ తర్వాత  ఆమె నుండి డబ్బు వసూలు చేయడానికి కూడా ప్రయత్నించారు. 

ఈ విషయమై సోనీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ప్రకటనలో ఇలా రాశారు, “మన చుట్టూ చాలా పెద్ద స్కామ్ జరుగుతోంది. ఎవరో నాకు ఫోన్ చేసి ఢిల్లీ కస్టమ్స్ నుంచి మాట్లాడుతున్నారని చెప్పారు. నేను కొన్ని చట్టవిరుద్ధమైన డ్రగ్స్ ఆర్డర్ చేశానని చెప్పాడు. తనకు కూడా పోలీసులకు సంబంధం ఉందని చెప్పాడు. అతను నా ఆధార్ కార్డ్ నంబర్ అడిగాడు. నాకు కాల్ వచ్చినట్లే, అదే విధంగా, నాకు తెలిసిన మరికొందరు కూడా కాల్ అందుకున్నారు.

“ఇంతమంది మీకు ఫోన్ చేసి భయపెట్టి, బెదిరించి, ఇలా మాట్లాడి మీ దగ్గర నుంచి చాలా డబ్బు లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారు. బాటమ్ లైన్ ఏమిటంటే, మీరు వారి మాటల్లో ఇరుక్కుపోకూడదు, వారి ప్రభావానికి గురికాకూడదు ఆమె చెప్పింది.
  
  మహేష్ భట్, బ్రిటిష్ నటి సోనీ రజ్దాన్ దంపతుల కుమార్తె  బాలీవుడ్ అందాల తార అలియా భట్. సోనీ రజ్దాన్ కాశ్మీరీ పండిట్ మరియు బ్రిటిష్ జర్మన్ వంశానికి చెందినవారు. ఆమె బ్రిటిష్ పౌరసత్వాన్ని కలిగి ఉంది.  
 

PREV
click me!

Recommended Stories

రవితేజ సంచలన నిర్ణయం, మాస్ మహారాజా ట్యాగ్ ను దూరం పెట్టిన స్టార్ హీరో?
Sanjana Remuneration : విన్నర్ రేంజ్ లో పారితోషికం అందుకున్న సంజన గల్రానీ, 15 వారాలు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నందుకు ఎంత ఇచ్చారంటే?