ప్రియాంక చోప్రా ఇంట్లో పెళ్లి రద్దు!

By AN TeluguFirst Published May 3, 2019, 11:41 AM IST
Highlights

బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా ప్రస్తుతం హాలీవుడ్ ప్రాజెక్ట్ లతో బిజీగా గడుపుతోంది. 

బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా ప్రస్తుతం హాలీవుడ్ ప్రాజెక్ట్ లతో బిజీగా గడుపుతోంది. ఇటీవల హాలీవుడ్ సింగర్ నిక్ జోనస్ ని వివాహం చేసుకొని అక్కడే సెటిల్ అయిపోయింది. అయితే ప్రియాంక ఇంట ఇప్పుడు వివాహం రద్దైనట్లు తెలుస్తోంది.

ప్రియాంక సోదరుడు సిద్ధార్థ్ వివాహం గత వారంలోనే ఇషితా కుమార్ అనే యువతితో జరగాల్సివుంది. వీరిద్దరూ కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్నారు. ఇంట్లో వారు వీరి పెళ్లికి అంగీకరించడంతో నిశ్చితార్ధం జరుపుకున్నారు. అయితే పెళ్లి సమయంలో ఇషితాకి సర్జరీ జరగడంతో వివాహాన్ని వాయిదా వేసుకున్నట్లు మొదట్లో వార్తలు వచ్చాయి.

కానీ ఇషితా, సిద్ధార్థ్ కి బ్రేకప్ జరిగిందని, వివాహ వేడుకను మొత్తానికే రద్దు చేసినట్లు తాజా సమాచారం. ఇషితా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో ఎంగేజ్మెంట్ ఫోటోలను తొలగించడంతో పెళ్లి రద్దు వార్తలు నిజమేనని అంటున్నారు. సోదరుడి పెళ్లి కోసం అమెరికానుండి ముంబై చేరుకున్న ప్రియాంక పెళ్లి రద్దయిన కారణంగా రెండు రోజుల్లోనే తిరిగి అమెరికా వెళ్లిపోయారు.

అయితే ఈ విషయానికి సంబంధించి ప్రియాంక నుండి ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఇది ఇలా ఉండగా.. ప్రియాంక భర్త నిక్ జోనస్ సోదరుడు జో జోనస్ వివాహం బుధవారం ఘనంగా జరిగింది. హాలీవుడ్ నటి సోఫీ టర్నర్ ని ప్రేమ వివాహం చేసుకున్నాడు జో జోనస్. 

click me!