ఆ రాత్రంతా ఏడుస్తూనే ఉన్నా.. హీరోయిన్ కామెంట్స్!

Published : May 03, 2019, 10:33 AM IST
ఆ రాత్రంతా ఏడుస్తూనే ఉన్నా.. హీరోయిన్ కామెంట్స్!

సారాంశం

ప్రముఖ నటి సోనాలీ బింద్రే క్యాన్సర్ కి గురయిన సంగతి తెలిసిందే. దీనికోసం ఆమె కొన్నాళ్లపాటు అమెరికాలో చికిత్స తీసుకొని తిరిగి ఇండియాకి వచ్చారు.

ప్రముఖ నటి సోనాలీ బింద్రే క్యాన్సర్ కి గురయిన సంగతి తెలిసిందే. దీనికోసం ఆమె కొన్నాళ్లపాటు అమెరికాలో చికిత్స తీసుకొని తిరిగి ఇండియాకి వచ్చారు. తనకు హైగ్రేడ్ క్యాన్సర్ వచ్చిందని తెలిసినరోజు నుండి ఇప్పటివరకు తన భర్త, కుమారుడు తనకు తోడుగా నిలిచారని తాజాగా ఓ షోలో పాల్గొన్న సోనాలి చెప్పుకొచ్చారు.

తనకు హైగ్రేడ్ క్యాన్సర్ ఉందని తెలిసిన రోజు రాత్రంతా ఏడుస్తూనే ఉన్నానని, ఆ రాత్రంతా నిద్ర పట్టలేదని అన్నారు. తన భర్త, కొడుకుని వదిలి వెళ్లిపోతానేమో అన్నంత భయం వేసిందని చెప్పుకొచ్చింది.

ఆ రాత్రి ఎంతో ఒత్తిడికి గురైనట్లు.. ఆ తరువాత తనను తాను ధైర్యం తెచ్చుకొని ఇంకెప్పుడూ ఏడవకూడదని, బాధపడకూడదని  నిర్ణయించుకున్నట్లు తెలిపింది. అప్పటినుండి ఇప్పటివరకు ఎంతో ఆనందంగా ఉన్నానని, తన సంతోషానికి భర్త, కొడుకు తోడయ్యారు అంటూ చెప్పుకొచ్చింది.

తన కొడుకు ఎంతో పరిణతితో ఆలోచించాడని, చిన్న వయసే  అయినా ఎంతో ధైర్యంగా, పరిపక్వత చూపించాడని తెలిపింది. కొడుకును బాధపెట్టకూడదని నవ్వుతూనే ఉన్నట్లు గుర్తుచేసుకుంది. ఇకపై అలానే ఉంటానని వెల్లడించింది. జీవితంలో తనను బాగా చూసుకునే వ్యక్తి తన భర్తే అంటూ చెప్పుకొచ్చింది.  

PREV
click me!

Recommended Stories

Richest TV Actress: మనదేశంలో అత్యంత ధనవంతురాలైన సీరియల్ నటి ఎవరో తెలుసా?
Rakshit Shetty: ఒంటరిగానే ఉండటమే ఇష్టం.. విజయ్‌ దేవరకొండతో రష్మిక పెళ్లి తర్వాత రక్షిత్‌ శెట్టి షాకింగ్‌ రియాక్షన్‌