Waltair Veerayya Trailer: మాస్‌ అనే పదానికి బొడ్డుకోసి పేరెట్టిందే ఆయన్ని చూసి.. మెగాఫ్యాన్స్ కి పూనకాలే..

Published : Jan 07, 2023, 06:24 PM ISTUpdated : Jan 07, 2023, 07:48 PM IST
Waltair Veerayya Trailer: మాస్‌ అనే పదానికి బొడ్డుకోసి పేరెట్టిందే ఆయన్ని చూసి..  మెగాఫ్యాన్స్ కి పూనకాలే..

సారాంశం

మెగాస్టార్‌ చిరంజీవి నటించిన `వాల్తేర్‌ వీరయ్య` ట్రైలర్ విడుదలైంది. చిరంజీవి, రవితేజ మధ్య వచ్చే సీన్లు హైలైట్‌గా నిలిచాయి. మెగా ఫ్యాన్స్ కిది పూనకాలు తెప్పించేలా ఉండటం విశేషం.

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా నటిస్తున్న మూవీ `వాల్తేర్‌ వీరయ్య`. రవితేజ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో శృతి హాసన్‌, కేథరిన్‌ థ్రెస్సా హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది. తాజాగా శనివారం ట్రైలర్‌ విడుదలైంది. ఇందులో మాస్‌,ఫన్‌, యాక్షన్‌ మేళవింపుగా ఉన్న ఈ ట్రైలర్‌ అదరగొడుతుంది. చిరంజీవిలోనా ఫన్‌ యాంగిల్‌ని బయటకు తీసుకొస్తుంది. 

అంతేకాదు ఫవర్‌ ఫుల్‌ డైలాగులు మెగాస్టార్‌ ఫ్యాన్స్ కి ట్రీట్‌లా ఉన్నాయి. `మాస్‌ అనే పదానికి బొడ్డుకోసం పేరెట్టిందే ఆయన్ని చూసి`, `వీడు ఎర అసలు సొర నువ్వే` అని, అలాగే `వైజాగ్‌లో వేటగాడు లేక ఒక పులి పూనకాలతో ఊగుతుందట..` అని రవితేజ చెప్పే డైలాగ్‌, `రికార్డుల్లో నా పేరు ఉండటం కాదు, నా పేరు మీదే రికార్డులున్నాయి` అని చిరంజీవి చెప్పే డైలాగులు, `హలో మాస్టారు ఒక్కసారి ఫేస్‌ టర్నింగ్‌ ఇచ్చుకోండి.. ఒక్కొక్కడికి బాక్సులు బద్దలైపోతాయి` అని చెప్పగా, ఏంట్రా బద్దలయ్యేది నీలాంటి కమిషనర్లు వస్తుంటారు పోతుంటారు, ఇక్కడ వీరయ్య లోకల్‌` అని చిరంజీవి చెప్పే డైలాగ్‌లు అదరహో అనిస్తున్నాయి. 

ఇందులో చిరంజీవి, రవితేజ తమ పాత సినిమా డైలాగులను మార్చుకుని చెప్పడం ఇందులో హైలైట్‌ పాయింట్‌. దీనికితోడు చిరంజీవి మార్క్ కామెడీ ఇందులో మరో హైలైట్‌గా ఉండబోతుందని ట్రైలర్‌ని చూస్తుంటే అర్థమవుతుంది. రెగ్యూలర్‌ మాస్‌ కమర్షియల్‌ చిత్రమే కాదు, ఇందులో డ్రగ్స్, మాఫియా వంటి మరో బలమైన పాయింట్‌ని కూడా చూపించబోతున్నారని అర్థమవుతుంది. ట్రైలర్‌ మెగా ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించేలా ఉండటం విశేషం. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ఈనెల 13న విడుదల కానుంది. రేపు వైజాగ్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ జరగబోతుంది. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Allu Arjun Fees: దేశంలోనే అత్యంత ఖరీదైన స్టార్‌గా అల్లు అర్జున్.. ఒక్క దెబ్బతో రజినీ, షారుఖ్ రేంజ్
Venkatesh: ఫస్ట్ మూవీలోనే బికినీలో చూపించింది అందుకే.. ఓపెన్ గా చెప్పేసిన డైరెక్టర్, వెంకటేష్ కష్టాలు