`భోళాశంకర్‌` సెట్లోకి వీరయ్య ఎంట్రీ.. కేక్‌ కట్‌ చేసి స్వాగతం పలికిన కీర్తిసురేష్‌..

Published : Jan 19, 2023, 06:12 PM IST
`భోళాశంకర్‌` సెట్లోకి వీరయ్య ఎంట్రీ.. కేక్‌ కట్‌ చేసి స్వాగతం పలికిన కీర్తిసురేష్‌..

సారాంశం

`వాల్తేర్‌ వీరయ్య` ఇచ్చిన సక్సెస్‌ ఆనందంలో ఫుల్‌ జోస్‌లో ఉన్నారు చిరు. ఇక ఇప్పుడు ఆయన `భోళా శంకర్‌`గా మారబోతున్నారు. మెహర్‌ రమేష్‌ దర్శకత్వంలో చిరంజీవి `భోళా శంకర్‌` చిత్రం చేస్తున్నారు.

మెగాస్టార్‌ చిరంజీవి సంక్రాంతికి అదిరిపోయే విజయాన్ని అందుకున్నారు. `వాల్తేర్‌ వీరయ్య`తో ఆయన హిట్ కొట్టారు. ఈ సినిమా రూ.150కోట్ల దాటి దూసుకుపోతుంది. ఇప్పటికే సినిమా బ్రేక్‌ ఈవెన్‌ అయ్యింది. ఇకపై లాభాల్లో సాగబోతుంది. ఇంకో వారం పాటు ఈ సినిమా రన్‌ ఉంది. ఇది ఓ రకంగా చిరంజీవికి పెద్ద బూస్ట్ ఇచ్చిందని చెప్పొచ్చు. `వాల్తేర్‌ వీరయ్య` ఇచ్చిన సక్సెస్‌ ఆనందంలో ఫుల్‌ జోస్‌లో ఉన్నారు చిరు. ఇక ఇప్పుడు ఆయన `భోళా శంకర్‌`గా మారబోతున్నారు. 

మెహర్‌ రమేష్‌ దర్శకత్వంలో చిరంజీవి `భోళా శంకర్‌` చిత్రం చేస్తున్నారు. తమన్నా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో కీర్తిసురేష్‌ కీలక పాత్ర పోషిస్తుంది. ఆమె చిరుకి చెల్లిగా నటిస్తుండటం విశేషం. ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. `వాల్తేర్‌ వీరయ్య` హడావుడి పూర్తి కావడంతో `భోళాశంకర్‌` షూటింగ్‌పై ఫోకస్‌ పెట్టారు చిరు. తాజాగా గురువారం ఆయన సినిమా సెట్‌లో జాయిన్‌ అయ్యారు. చిరుకి యూనిట్‌ గ్రాండ్‌గా వెల్‌కమ్‌ చెప్పింది. `వాల్తేర్‌ వీరయ్య` సక్సెస్‌ని కేక్‌ కట్‌ చేసి సెలబ్రేట్‌ చేశారు. ఇందులో కీర్తిసురేష్‌ కూడా ఉండటం విశేషం. చిరుకి కేక్‌ తినిపించి అభినందనలు తెలిపింది. 

చిరంజీవి, కీర్తిసురేష్‌లపై షూటింగ్‌ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై అనిల్‌ సుంకర నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఈ ఏడాదిలోనే విడుదల చేయబోతున్నట్టు సమాచారం. ఈ సినిమా తమిళంలో రూపొందిన `వేదాళం`కి రీమేక్‌. అక్కడ అజిత్‌ నటించారు. అక్కడ పెద్ద విజయం సాధించింది. కొన్ని మార్పులు చేసి తెలుగులో రీమేక్‌ చేస్తున్నారు. 

ఈ రీమేక్‌లపై చిరంజీవి స్పందిస్తూ, ఇప్పుడు ఓటీటీలు వచ్చి బాగున్న సినిమాలను ఓటీటీలో అన్ని భాషల ఆడియెన్స్ చూస్తున్నారు. దీంతో వాటి ప్రభావం తగ్గింది. అయితే పెద్ద హీరోలు ప్రాపర్‌గా కథలో మార్పులు చేసి, నెటివిటీకి తగ్గట్టుగా మార్చి బాగా తీయగలిగితే రీమేక్‌లకు ఆదరణ ఎప్పుడూ ఉంటుందని చెప్పారు. అందులో భాగంగానే ఆయన వరుసగా రీమేక్‌లకు ఓకే చెబుతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే రీఎంట్రీ మూవీ `ఖైదీ నెంబర్‌ 150` రీమేక్‌ అనే విసయం తెలిసిందే. విజయ్‌ నటించిన `కత్తి`కి రీమేక్‌. ఆ తర్వాత నటించిన `గాడ్‌ ఫాదర్‌` రీమేకే, అది మలయాళంలో సూపర్‌ హిట్‌ `లూసీఫర్‌`కి రీమేక్‌. ఇప్పుడు `భోళాశంకర్`. దీంతోపాటు `విశ్వాసం` కూడా రీమేక్‌ చేస్తున్నట్టు సమాచారం. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?