మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) తాజాగా అభిమానులతో పంచుకున్న ఓ అరుదైన ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. ఆ బ్యూటీఫుల్ ఫొటోను చూసిన అభిమానులు ఖుషీ అవుతున్నారు.
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం కేరీర్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. భారీ ప్రాజెక్టులను లైనప్ లో పెడుతూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. మరోవైపు కుటుంబ సభ్యులతోనూ చాలా హ్యాపీగా ఉంటారనే విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే తాజా మెగాపవర్ స్టార్ షేర్ చేసిన ఓ ఫొటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ ఫొటో చేసిన మెగా అభిమానులు, నెటిజన్లు తెగ మురిసిపోతున్నారు. లైక్స్, కామెంట్లతో ఫొటోను మరింతగా వైర్ చేస్తూ వస్తోంది.
ఇంతకీ ఆ ఫొటో ఏంటనుకుంటున్నారా?.. రామ్ చరణ్ - వరుణ్ తేజ్ చిన్నప్పటి ఫ్యామిలీ ఫొటోనే అది. ఈ రోజు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) 33వ పుట్టిన రోజు కావడంతో రామ్ చరణ్ ఈ అరుదైన బ్యూటిఫుల్ ఫొటోను షేర్ చేస్తూ.. వరుణ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘తను జీవితంలో మంచి ఆరోగ్యంతో సక్సెస్ బాటలో నడవాలని ఆకాంక్షించారు.’ ఫొటోలో రామ్ చరణ్ ఆనందంగా నవ్వుతూ వరుణ్ తేజ్ ను ఎత్తుకొని కనిపిస్తాడు. ఇద్దరూ కలిసి ఉన్న ఈ చిన్ననాటి ఫొటోను చూసి మెగా అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. చెర్రీ నుంచి అరుదైన ఫొటో రావడంతో తమ్ముడు వరుణ్ తేజ్ ఎంత ప్రేమో అంటున్నారు.
ఇక మరికొందరు అభిమానులు ఈ ఫొటో చూస్తుంటూ.. ‘నాగబాబును ఎత్తుకున్న చిరంజీవిలా’ ఉన్నారంటూ అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా రామ్ చరణ్ నుంచి వరుణ్ పుట్టిన రోజున ఇలాంటి ఫొటో రావడం అటు వరుణ్ తేజ్ కు, ఇటు అభిమానులకు చిన్నపాటి సర్ ప్రైజ్ అని చెప్పొచ్చు. అలాగే చరణ్ ఫ్యాన్స్ కూడా వరుణ్ తేజ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తన అప్ కమింగ్ ఫిల్మ్స్ తో మంచి సక్సెస్ అందుకోవాలని ఆశిస్తున్నారు.
వరుణ్ బర్త్ డే సందర్భంగా వరుణ్ 12వ చిత్రం నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ వచ్చేసింది. సినిమాకు ‘గాండీవధారి అర్జున’ (Gandeevadhari Arjuna)గా ఇంట్రెస్టింగ్ టైటిల్ ను ఖరారు చేశారు. వరుణ్ స్టైలిష్ గా కనిపిస్తూ.. యాక్షన్ తో దుమ్ములేపుతున్న ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా సినిమాపై ఆసక్తినిపెంచుతోంది. చిత్రాన్ని బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ జోనర్ లోని ఈ చిత్రానికి ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్నారు. ఇక మెగ పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ‘ఆర్సీ15’లో నటిస్తున్నారు. తర్వాత బుచ్చిబాబుతో ‘ఆర్సీ16’ రానుంది. మరో నాలుగు ప్రాజెక్ట్స్ కూడా చెర్రీ లైనప్ లో ఉన్నాయి.
Happiest birthday !
Wishing you the best of health and success ❤️ pic.twitter.com/aMI4php3ae