యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్పీచ్ కోసం వెయిటింగ్.. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత అభిమానులకు ఐ ఫీస్ట్.. తరలివస్తున్న ఫ్యాన్స్..

Published : Jul 29, 2022, 02:36 PM IST
యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్పీచ్ కోసం వెయిటింగ్.. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత అభిమానులకు ఐ ఫీస్ట్.. తరలివస్తున్న ఫ్యాన్స్..

సారాంశం

యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) రాక కోసం అంతా  ఎదురుచూస్తున్నారు. ఈ రోజు ‘బింబిసార’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరవుతున్నందున ఎన్టీఆర్ అభిమానులు వేలాదిగా హైదరాబాద్ కు తరలివస్తున్నారు.   

నందమూరి కళ్యాణ్ రామ్ - హీరోయిన్ కేథరిన్ ట్రెసా జంటగా నటించిన తాజా ఫాంటసీ ఫిల్మ్ ‘బింబిసార’(Bimbisara). చాలా కాలం తర్వాత పక్కా హిట్ ఫార్మూలాతో దూసుకువస్తున్నాడు నందమూరి కళ్యాణ్ రామ్. ప్రస్తుతం ఈ చిత్రం రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఈ రోజు హైదరాబాద్ లోని శిల్పా కళావేదికలో సాయంత్రం 6 గంటలకు గ్రాండ్ గా నిర్వహించనున్నారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. చీఫ్ గెస్ట్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) హాజరవుతున్నారు. దీంతో వేలాదిగా అభిమానులు హైదరాబాద్ కు తరలివస్తున్నారు. 

‘ఆర్ఆర్ఆర్’ మూవీ తర్వాత తొలిసారిగా అభిమానులతో ఇంటరాక్ట్ కాబోతున్నారు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ రెండు తెలుగు రాష్ట్రాల నుంచి హైదరాబాద్ కు తరలివస్తున్నారు. ఇప్పటికే కొందరు అభిమానులు శిల్పా కళా వేదిక వద్ద భారీ కటౌట్స్ తో ఎన్టీఆర్ కు స్వాగతం పలుకుతున్నారు. ఇప్పటికే తిరుపతి నుంచి అభిమానులు బయల్దేరారు. ఎప్పుడూ అభిమానుల గురించే మాట్లాడే ఎన్టీఆర్.. చాలా కాలం తర్వాత ఫ్యాన్స్ ను ఉద్దేశించాలని ఇవ్వబోయే స్పీచ్ కోసం ఎదురుచూస్తున్నారు. దీంతో శిల్పా కళా వేదిక మొత్తం ఎన్టీఆర్ అభిమానులతో నిండిపోనుంది. 

ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్లు, ట్రైలర్, పాటలు ఆడియెన్స్ ను ఆకట్టుకుంటున్నాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్ తో చిత్రంపై మరిన్నీ అంచనాలు పెరిగిపోనున్నాయి. బింబిసార పార్ట్ 2లోనూ ఎన్టీఆర్ ఎంట్రీ ఉంటుందని ఇప్పటికే కళ్యాణ్ రామ్ చెప్పిన విషయం తెలిసిందే. దీంతో సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి.  ఆగస్టు  5న అన్నీ భాషల్లో మూవీ రిలీజ్ కానుంది.  హీరోయిన్లుగా కేథరిన్ ట్రెసా  (Catherine Tresa), సంయుక్త మీనన్ నటిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై చిత్రాన్ని రూపొందించారు. మల్లిడి వశిష్ట్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఎంఎం కీరవాణీ అద్భుతమైన సంగీతం అందిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

OTT Movies: ఈ వారం ఓటీటీ రిలీజ్‌⁠లు ఇవే.. సంచలనం సృష్టించిన చిన్న సినిమా, తప్పక చూడాల్సిన థ్రిల్లర్స్ రెడీ
Bigg Boss Telugu 9: భరణి ఎలిమినేటెడ్.. టాప్ 5 సభ్యులు వీరే, ప్రియురాలి కోసం ఇమ్ము చేయబోతున్న త్యాగం ఇదే