బాలయ్య బాబుకు అరుదైన గౌరవం, దిల్ ఖుష్ అవుతున్న నటసింహం అభిమానులు

Published : Jul 29, 2022, 11:00 AM IST
బాలయ్య బాబుకు అరుదైన గౌరవం, దిల్ ఖుష్ అవుతున్న నటసింహం అభిమానులు

సారాంశం

బాలయ్య బాబు అంటే ఓ బ్రాండ్. కొన్ని లక్షలమంది అభిమానుల ఆరాధ్య దైవం. ఆయన కనుసైగ చాలు అని ఎదురుచూసేవారు చాలా మంది ఉన్నారు. అటువంటింది బాలయ్యకు అరుదైన గౌరవం దక్కబోతోందంటే వారి ఆనందానికి అవదులు ఉంటాయా..?   


సినీమా జీవితంలో  ఎన్నో మలుపులు, ఎన్నో విజయాలు, మరెన్నో అద్భుతాలు, హిట్  సినిమాలు, ప్లాప్ సినిమాలు..ఎన్నో అవార్డ్ లు మరెన్నో సత్కారాలు...బాల‌కృష్ణ జీవితం అంతా సినిమాల మయం. ఇక ఇప్పుడు ఆయన సత్కారాల లిస్ట్ లో మరొకటి చేరింది. బాలయ్య అవార్డ్ ల సరసన మరో అవార్డ్ చేరబోతోంది.  నందమూరి నటసింహం బాలకృష్ణకు అరుదైన గౌరవం దక్కింది. ఆయనకు సినారే జీవన సాఫల్య జాతీయ స్వర్ణకంకణ పురస్కారం అందజేయబోతున్నట్లు తెలుస్తుంది. 

మహా కవి సి. నారాయణ రెడ్డి 91వ జయంతి ఉత్సవాల సందర్భంగా నందమూరి బాలకృష్ణను సత్కరించబోతున్నారట. జులై 30న రవీంద్రభారతిలో ఈ పురస్కారం ఆయనకు ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. బాలకృష్ణకు ఈ అరుదైన పురస్కారం లభించడం పట్ల నటసింహం  అభిమాన  సంఘాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. నందమూరి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. 

ఇక  బాలకృష్ణ సినిమాల విషయానికి వస్తే.. రీసెంట్ గా అఖండ సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు బాలకృష్ణ. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మాస్ ఆడియన్స్‌కి పూనకాలు తెప్పించింది. ముఖ్యంగా బాలయ్య అభిమానులకు చెప్పలేనంత కిక్కిచ్చింది. ఆ సినిమా హిట్ జోష్ లో  బాలయ్య  ప్రస్తుతం తన 107 షూటింగ్ లో  బిజీ బిజీగా ఉన్నాడు. మలినేని గోపీచంద్ డైరెక్షన్ లో ఊరమాస్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతోంది. 

బాలయ్య సినిమా షూటింగ్ మాత్రం సూపర్ ఫాస్ట్ గా సాగుతోంది. మేజర్ షూటింగ్ అయిపోవస్తుంది కూడా.. కాని ఇంత వరకూ ఈ సినిమా టైటిల్ మాత్రం  అనౌన్స్ చేయలేదు.బాలయ్య 107వ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ తో ఫ్యాన్స్ కు నమ్మకం వచ్చేసింది. సినిమాపై ఇప్పటికే అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఈ సినిమాలో ఆయన పాత్ర ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందో తేలిపోయింది. బాలయ్య భిమానుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా `అఖండ` స్థాయిని అంతకంతకు పెంచేలాఈ సినిమా  ఉంటుందని అభిమానులు ఎంతో కాన్పిడెంట్ గా ఉన్నారు.  హైదరాబాద్ లో షూటింగ్ పూర్తి చేసుకుని.. కర్నూలు లో తదుపరి షెడ్యూల్ కొనసాగిస్తున్నారు టీమ్.  ఇక వరుసగా తన సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నాడు బాలయ్య. 

PREV
click me!

Recommended Stories

చిరంజీవినే ఎదిరించిన అనిల్ రావిపూడి, మెగాస్టార్ మాటకు నో చెప్పిన దర్శకుడు, కారణం ఏంటి?
Bigg Boss 9 Winner: బిగ్‌ బాస్‌ విన్నర్‌ని కన్ఫమ్‌ చేసిన భరణి, సుమన్‌ శెట్టి.. నాగార్జునకి కొత్త తలనొప్పి