ఫైనల్ గా వినాయక్ చేతిలో మల్టీస్టారర్!

Published : May 06, 2019, 04:40 PM IST
ఫైనల్ గా వినాయక్ చేతిలో మల్టీస్టారర్!

సారాంశం

  టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ వినాయక్ గత కొంత కాలంగా వరుస అపజయాలను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అయితే సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నా కూడా చాలా మంది హీరోలకు ఆయనతో వర్క్ చేయాలనే కోరిక ఉంది.

టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ వినాయక్ గత కొంత కాలంగా వరుస అపజయాలను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అయితే సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నా కూడా చాలా మంది హీరోలకు ఆయనతో వర్క్ చేయాలనే కోరిక ఉంది. అయితే నిర్మాతల వల్లనో లేక వినాయక్ టైమ్ బ్యాడ్ అవ్వడం వల్లనో తెలియదు గాని మరో సినిమా సెట్స్ పైకి వెళ్ల లేదు. 

ఇక ఫైనల్ గా రీమేక్ కథతో మళ్ళీ తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ విక్రమ్ వేధా సినిమాను వినాయక్  డైరక్ట్ చేయబోతున్నాడు. తమిళ్ లో మాధవన్ - విజయ్ సేతుపతి నటించగా ఇప్పుడు తెలుగులో వెంకటేష్ - నారా రోహిత్ నటించబోతున్నారు. ఇదివరకే వినాయక్ తో వెంకీ పనిచేశాడు. 

2006లో వీరి కాంబినేషన్ లో వచ్చిన లక్ష్మి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇన్నాళ్ళకి మళ్ళీ ఒకటవ్వబోతున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ లో ఉన్న వినాయక్ త్వరలో సినిమా షూటింగ్ ని మొదలెట్టనున్నాడు.  

PREV
click me!

Recommended Stories

ఇదెక్కడి ట్విస్ట్ బాబూ.! నాగచైతన్యతో సమంత, శోభిత.. అసలు మ్యాటర్ ఇది
Illu Illalu Pillalu Today Episode Dec 23: అమూల్యను విశ్వ ట్రాప్ చేశాడని తెలుసుకున్న ధీరజ్, ఇంగ్లిష్ టీచర్ వల్లి