VV Vinayak: కుర్ర హీరోతో వివి వినాయక్ నెక్స్ట్ మూవీ ఫిక్స్

By tirumala AN  |  First Published Feb 12, 2024, 5:35 PM IST

వినాయక్ చివరగా బాలీవుడ్ లో బెల్లం కొండ శ్రీనివాస్ హీరోగా ఛత్రపతి చిత్రాన్ని రీమేక్ చేశారు. ఆ మూవీ దారుణంగా ఫ్లాప్ అయింది. 2018లో సాయిధరమ్ తేజ్ తో ఇంటెలిజెంట్ చిత్రం తర్వాత వినాయక్ మరో తెలుగు మూవీ చేయలేదు. 


మాస్ పల్స్ తెలిసిన దర్శకుడు వివి వినాయక్ టాలీవుడ్ లో చాలా మంది స్టార్ హీరోలకు హిట్స్ ఇచ్చారు. ఆది, ఠాగూర్, దిల్, బన్నీ, అదుర్స్, నాయక్ లాంటి హిట్ చిత్రాలు తెరకెక్కించింది ఈ దర్శకుడే. అయితే ఇటీవల వినాయక్ బాగా స్లో అయ్యారు. ట్రెండ్ కి తగ్గట్లుగా కొత్త ఆలోచనలతో సినిమాలు చేయడం లో విఫలం అవుతున్నారు. 

వినాయక్ చివరగా బాలీవుడ్ లో బెల్లం కొండ శ్రీనివాస్ హీరోగా ఛత్రపతి చిత్రాన్ని రీమేక్ చేశారు. ఆ మూవీ దారుణంగా ఫ్లాప్ అయింది. 2018లో సాయిధరమ్ తేజ్ తో ఇంటెలిజెంట్ చిత్రం తర్వాత వినాయక్ మరో తెలుగు మూవీ చేయలేదు. 

Latest Videos

ఇన్నేళ్ల గ్యాప్ తర్వాత టాలీవుడ్ లో వినాయక్ మెగా ఫోన్ పట్టబోతున్నారు. వినాయక్ నెక్స్ట్ మూవీకి హీరో దొరికేశాడు. ఊహించని విధంగా వినాయక్ కుర్ర హీరోని డైరెక్ట్ చేయబోతున్నారు. పెదకాపు చిత్రంలో హీరోగా నటించిన విరాట్ కర్ణతో వినాయక్ కొత్త చిత్రం ఫిక్స్ అయింది. 

నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి మేనల్లుడే విరాట్ కర్ణ. విరాట్ హీరోగా నటించిన పెదకాపు చిత్రం దారుణంగా నిరాశ పరిచింది. వినాయక్ మంచి యాక్షన్ స్క్రిప్ట్ ని రెడీ చేశారట. ఎట్టి పరిస్థితుల్లో హిట్ కొట్టాలని వినాయక్ పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కాంబినేషన్ కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెలువడనున్నాయి. 

click me!