వినాయక్ పై బెల్లంకొండ ఇంకో భారం?

By Surya PrakashFirst Published Jun 13, 2021, 8:25 AM IST
Highlights

వి.వి.వినాయక్ డైరెక్షన్‌లో సినిమా అంటే హీరోలు ఒక టైమ్ లో చాలా ఉత్సాహం చూపించేవారు . అయితే ‘అఖిల్’ వంటి భారీ డిజాస్టర్ తర్వాత ఆయన హవా తగ్గింది.

దర్శకుడుగా వి.వి.వినాయక్ పేరు చెప్పగానే ‘ఆది’, ‘దిల్’, ‘ఠాగూర్’, ‘బన్నీ’, ‘లక్ష్మీ’, ‘నాయక్’ వంటి సూపర్ హిట్ కమర్షియల్ సినిమాలు మన కళ్ల ముందు కనపడతాయి. హీరోయిజాన్ని నెక్ట్స్ లెవిల్ కు  తీసుకెళ్లిన దర్శకుడు ఆయన. మాస్ ఎలిమెంట్స్‌కు ఫన్ ని జతచేసి బ్లాక్ బస్టర్లుగా మలిచిన డైరక్టర్.  వి.వి.వినాయక్ డైరెక్షన్‌లో సినిమా అంటే హీరోలు ఒక టైమ్ లో చాలా ఉత్సాహం చూపించేవారు . అయితే ‘అఖిల్’ వంటి భారీ డిజాస్టర్ తర్వాత ఆయన హవా తగ్గింది.

 ఆ సినిమా తరవాత కూడా చిరంజీవి పిలిచి ‘ఖైదీ నెంబర్ 150’ బాధ్యతలు అప్పగించాక మళ్లీ ఫామ్ లోకి వస్తారనుకున్నారు. కానీ ఆ సినిమా హిట్ అయినా ఆ తర్వాత ఆయన కెరీర్ లో పెద్దగా కదలిక లేదు. అయితే ఆయనకు తొలి సినిమా అప్పచెప్పిన బెల్లంకొండ సురేష్ మాత్రం తన కొడుకు కెరీర్ ని వినాయిక్ చేతిలోనే ఉంచాలని ఫిక్స్ అయ్యారు.
 
ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ చేతిలో రెండు సినిమాలు రీమేక్ సినిమాలు ఉన్నాయి. వాటిలో ఒకటి హిందీలోకి రీమేక్ అవుతున్న తెలుగు ‘ఛత్రపతి’. దీన్ని వివి.వినాయక్ డైరెక్ట్ చేస్తున్నారు. షూటింగ్ కూడ మొదలైంది. శ్రీనివాస్ హిందీలోకి డెబ్యూ అవుతున్న సినిమా కావడంతో భారీగా ఖర్చుపెడుతున్నారు. అయితే కరోనా సెకండ్ వేవ్ లాక్ డౌన్ మూలంగా షూటింగ్ ఆగిపోయింది. సెట్ కూడ వర్షాల కారణంగా దెబ్బతింది. దాంతో షూటింగ్ ఎప్పుడో ఇంకా క్లారిటీ లేదు. ఈ క్రమంలో మరొక రీమేక్ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నారట బెల్లంకొండ.

తమిళంలో ఇటీవల హిట్ అయిన ‘కర్ణన్’ రీమేక్ హక్కులను బెల్లకొండ కొని పెట్టుకున్నారు. హిందీ చిత్రం మొదలవ్వడానికి కాస్త సమయం పెట్టేలా ఉంది కాబట్టి ఈలోపు ఈ రీమేక్ ఫినిష్ చేయాలని చూస్తున్నారట.  ఈ రీమేక్ బాధ్యతను కూడ వినాయక్ భుజాల మీదే పెట్టారని వినపడుతోంది.  ధనుష్ నటించిన ఈ సినిమా కోలీవుడ్‌లో మంచి కమర్షియల్ హిట్ అందుకుంది. దాంతో దీనిని తెలుగులో నిర్మించేందుకు ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ రైట్స్ దక్కించుకున్నారు. ఈ చిత్ర తెలుగు రీమేక్‌లో ఆయన తనయుడు యంగ్ హీరో బెల్లంకొండ శ్రీను నటించనున్నాడు.  

click me!