పవన్ తో చేయడంలేదు మలయాళీ యంగ్ బ్యూటీ క్లారిటీ!

Published : Jun 13, 2021, 07:50 AM IST
పవన్ తో చేయడంలేదు మలయాళీ యంగ్ బ్యూటీ క్లారిటీ!

సారాంశం

పవన్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న కాంబినేషన్స్ లో పవన్ హరీష్ కాంబినేషన్ ఒకటి. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసింది. 

పవన్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న కాంబినేషన్స్ లో పవన్ హరీష్ కాంబినేషన్ ఒకటి. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసింది.  పవన్ కళ్యాణ్ సినిమాలో హీరోయిన్‌గా చేయడం లేదంటూ క్లారిటీ ఇచ్చారు మలయాళ బ్యూటీ మానస రాధాకృష్ణన్. హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ తన 28వ సినిమా చేయనున్నట్టు ఎప్పుడో అధికారక ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. 


ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించబోతున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ అయినప్పటి నుంచి రక రకాల గాసిప్స్ సోషల్ మీడియాలో వచ్చి వైరల్ అవుతున్నాయి. టైటిల్ ఇదేనంటూ ప్రచారం జరుగుతోంది. దీంతో ఇటీవలే మేకర్స్ దీనికి సంబంధించిన ప్రతీ అప్‌డేట్ మేమే వెల్లడిస్తామని, ఒక అద్భుతమైన టైటిల్ అనుకున్నాము..ఆ టైటిల్ ప్రకటించడానికి చాలా ఆతృతగా ఉన్నామని, కానీ ఈ ప్రకటనకి ఇంకాస్త సమయం ఉందని ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.
 

ఈ క్రమంలో మలయాళ హీరోయిన్ మానస రాధాకృష్ణన్..తాను పవన్ కళ్యాణ్ సినిమాలో నటిస్తున్నట్టు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు ఏమాత్రం నిజం కాదని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ అయినప్పటి నుంచి ఈమె పేరు బాగా ప్రచారం చేశారు. తాజాగా మానస క్లారిటీ ఇచ్చి రూమర్స్‌కి చెక్ పెట్టారు.
 

PREV
click me!

Recommended Stories

ప్రభాస్, రామ్ చరణ్ తో పాటు.. 2026లో బాక్సాఫీస్ ను షేక్ చేయబోతున్న స్టార్ హీరోల సినిమాలు
Bigg Boss Telugu 9: నిధి అగర్వాల్ కి చుక్కలు చూపించిన ఇమ్మాన్యుయేల్.. హౌస్ లో కూడా ఆమె పరిస్థితి అంతేనా ?