ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రియా ఫోటోపై వల్గర్ కామెంట్స్

Published : Feb 20, 2018, 03:13 PM ISTUpdated : Mar 25, 2018, 11:56 PM IST
ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రియా ఫోటోపై వల్గర్ కామెంట్స్

సారాంశం

సోషల్‌ మీడియా సెన్సేషన్‌ ప్రియా వారియర్‌ తాజాగా ఆమె ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ఓ ఫోటో పోస్ట్‌ చేసింది. పలువురు యువకులు ఆమె పిక్ పై అనుచితంగా వ్యాఖానించారు.

సోషల్‌ మీడియా సెన్సేషన్‌ ప్రియా వారియర్‌పై పలువురు యువకులు అనుచితంగా వ్యవహరించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె ఫోటోపై అభ్యంతరకర కామెంట్లు చేశారు. దీంతో ఆమె సన్నిహితులు పోలీసులను ఆశ్రయించినట్లు తెలుస్తోంది.

తాజాగా ఆమె ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ఓ ఫోటో పోస్ట్‌ చేసింది. అయితే ఆ ఫోటోకు కొందరు యువకులు మరీ దారుణమైన కామెంట్లు చేశారు. ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ పెంచుకోవడం కాదంటూ.. డబుల్‌ మీనింగ్‌ డైలాగులతో కామెంట్లు పోస్ట్‌ చేశారు. దీనిని ప్రియా వారియర్‌ సీరియస్‌గా తీసుకుంది. ఆమె సన్నిహితులు సోమవారం ఈ విషయమై సైబర్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ను ఆశ్రయించినట్లు సమాచారం. ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

ఒరు ఆదార్‌ లవ్‌ చిత్రంలోని ఒక్క సీన్‌తో ఆమె విపరీతమైన క్రేజ్‌ సంపాదించుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె కోసం వివిధ భాషల మేకర్లు క్యూ కడుతున్నా ఆమె మాత్రం అంగీకరించటం లేదు.

PREV
click me!

Recommended Stories

Sanjana Remuneration : విన్నర్ రేంజ్ లో పారితోషికం అందుకున్న సంజన గల్రానీ, 15 వారాలు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నందుకు ఎంత ఇచ్చారంటే?
Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి