
సంక్రాంతికి సినిమా రిలీజైతే ఆ కిక్కే వేరు..ఆ లెక్కే వేరు అని అందరికీ తెలుసు. అయితే ఆ స్లాట్ లో డేట్ దొరకటం అనేది మామూలు విషయం కాదు. స్టార్ హీరోలకే సాధ్యం. 2025 కు ఎన్టీఆర్ సినిమా రిలీజ్ చేయబోతున్నారు. ఆ మేరకు ఏర్పాట్లు మొదలయ్యాయని సమాచారం. ఇంతకీ ఆ సినిమా ఏమిటి అంటారా
ఆ సినిమా మరేదో కాదు... బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటించబోతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వార్ 2’. యశ్ రాజ్ ఫిల్మ్ స్పై యూనివర్స్ సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ ఫిల్మ్ 'వార్' సీక్వెల్ గా 'వార్ 2' తెరకెక్కబోతోంది. ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించనున్నారు. ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ నవంబర్ 2023 నుంచి సెట్స్ మీదకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారని సమాచారం.
ఇప్పటికే సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో చిత్ర టీమ్ బిజీ అయ్యింది. ఇక ‘వార్ 2’ సినిమా విడుదలపైనా మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసి, 2025 సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. మొదట రిపబ్లిక్ డే అనకున్నా..ఎన్టీఆర్ సీన్ లోకి వచ్చేసరికి సంక్రాంతి అయితే ఓపినింగ్స్,కలెక్షన్స్ అదిరిపోతాయని భావించి నిర్మాత ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని అదే సమయంలో విడుదల చేయాలని భావిస్తున్నారట.
ఎన్టీఆర్ ఈ సినిమాలో ఎలాంటి పాత్ర చేయబోతున్నాడో అనేది తెలియాల్సి ఉంది. వార్ 2 మూవీ యశ్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా తెరకెక్కుతుంది. ఈ యూనివర్స్ లో సల్మాన్ ఖాన్ – టైగర్, షారుఖ్ ఖాన్ – పఠాన్ కూడా ఉన్నాయి. భవిషత్తులో ఎన్టీఆర్ తో కూడా బాలీవుడ్ లో సింగల్ హీరో మూవీ ఉండే ఛాన్స్ ఉంటుంది. అయితే ‘వార్ 2’ చిత్రంలో హీరోగా హృతిక్ రోషన్ నటిస్తుండగా, నెగెటివ్ రోల్ లో ఎన్టీఆర్ కనిపించనున్నారని వార్తలు వస్తున్నాయి. 'వార్' సినిమాలో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా నటించారు. సినిమాలో ఇద్దరి మధ్య భారీ యాక్షన్ సీక్వెన్సులు ఉన్నాయి. ఇద్దరూ పోటా పోటీగా నటించారు. చివరకు, టైగర్ ష్రాఫ్ క్యారెక్టర్ మరణించినట్టు చూపించారు. ఆ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ఈ చిత్రంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్నారు. ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూ మూవీ కావడంతో అభిమానులలో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
‘దేవర’విషయానికి వస్తే... క్యాస్టింగ్‌తో ప్రేక్షకుల అంచనాలను మరింతగా పెంచేసింది. ఈ చిత్రంతో శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ మొదటిసారిగా టాలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది. తమిళ రాక్‌స్టార్ అనిరుధ్.. దేవరకు మ్యూజిక్‌ను అందిస్తున్నాడు. సైఫ్ అలీ ఖాన్ ఇందులో విలన్‌గా నటిస్తున్నాడు. షైన్ టామ్ చాకో కూడా దేవరలో కీలక పాత్రలో కనిపించనున్నాడు. ‘దేవర’.. 2024 ఏప్రిల్ 5వ తేదీన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలకు సిద్ధమవుతోంది.