
వివేక్ ఒబెరాయ్ పై ముంబై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. అందుకు కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఇటీవల వాలెంటైన్స్ డే సందర్భంగా తన భార్యతో కలిసి బైక్‌పై బయటకు వెళ్లాడు. భార్యతో బయటకు వెళితే కేసు కేసు ఏమిటీ అంటారా. భార్యతో వెళ్లినందుకు కాదు..ఆ క్రమంలో ఆయన చేసిన ఓ పొరపాటు..క్షమాపణ చెప్పాల్సిన సిట్యువేషన్ తీసుకొచ్చింది.
వాలెంటైన్స్ డే సందర్భంగా వివేక్ భార్య ఆయనకు ఓ బైక్‌ని బహుమతిగా ఇచ్చింది. దీంతో అదే రోజు శ్రీమతిని బైక్‌పై ఎక్కించుకొని ముంబై వీధుల్లో చక్కర్లు కొట్టాడు. దీనికి సంబంధించిన వీడియోను స్వయంగా వివేక్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. వివేక్ ఒబెరాయ్ వాలెంటైన్స్ డే రోజున తన భార్య ప్రియాంక అల్వా తో బైక్‌పై వెళ్లినప్పుడు ఓ మాస్క్‌గానీ, హెల్మెట్ గానీ ధరించలేదు. ఈ వీడియోలో ఈ జంట ముంబైలో హార్లే డేవిడ్సన్ బైక్‌పై విహరిస్తూ దుమ్మురాపారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదీ పోలీస్ ల దృష్టీనీ ఆకర్షించింది.
వివేక్ బైక్‌పై అలా మాస్క్ గానీ, లేదా హెల్మెట్ గానీ లేకుండా వెళ్లడం చట్టవిరుద్ధం కావడంతో ముంబై శాంటాక్రూజ్ ట్రాఫిక్ పోలీసులు వివేక్’కు రూ .500 ఫైన్ వేశారు. ఈ ఉల్లంఘన చేసినందుకు ఐపిసి సెక్షన్లు 188, 269 రెండింటి కింద ఆరు నెలల వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించవచ్చు. ఇక మరోవైపు తనపై ముంబై పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ పై వివేక్ ఒబెరాయ్ స్పందించారు. వివేక్ క్షమాపణలు చెబుతూ మరో వీడియోను షేర్ చేశారు. అంతేకాకుండా పోలీసులు తనకు రక్షణ నిబంధనలను గుర్తుచేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలపారు.
వివేక్ ఒబెరాయ్.. రాం గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన హిట్ సినిమా కంపెనీ(2002) తో బాలీవుడ్ తెరంగేట్రం చేశాడు. ఈ సినిమాలోని ఆయన నటనకు ఫిలింఫేర్ పురస్కారాలను అందుకున్నాడు. ఆ తర్వాత వివేక్ తెలుగులో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన రక్త చరిత్ర1 రక్త చరిత్ర2లో కీలకపాత్రలో కనిపించాడు.ఇక వివేక్ చివరగా ప్రధానమంత్రి మోదీ బయోపిక్‌లో కనిపించారు. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.